రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఏ  లైసెన్స్ రద్దు

విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగియాన్న ఆరోపణల నేపథ్యంలో సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్​జీల ఎఫ్​సీఆర్​ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్​సీఆర్​ఏ) లైసెన్స్‌ను రద్దు చేసింది .
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పై విచారణ జరిపిన అనంతరం ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్రస్టీలుగా ఉన్నారు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్థాపించారు. 1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్ కోసం తీర్మానం ఆమోదించింది. 1991లో స్థాపించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్  అప్పటి నుంచి  2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వికలాంగుల సహాయం మొదలైన అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేసింది.
అంతేకాదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ విద్యా రంగంలో కూడా పనిచేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు చైనా నుండి నిధులు అందుతున్నయన్న విషయంపై దర్యాప్తుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ మొదలైన పలు చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేసేందుకు మంత్రిత్వ శాఖ అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ ఆధారంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా జూన్ 2020లో లడఖ్‌లో భారతదేశం, చైనా సైనికుల మధ్య ముఖాముఖి ఘర్షణ తలెత్తిన సమయంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి 2005 నుండి 2009 మధ్య ఈ ఫౌండేషన్ కు  జాతీయ ప్రయోజనాలతో సంబంధం లేని అంశాలపై అధ్యయనాలను నిర్వహించడానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపించారు.

ప్రధానమంత్రి సహాయ నిధిని గాంధీ ఫ్యామిలీ ట్రస్ట్‌కు మళ్లించారని, పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ నుంచి కూడా ఆర్‌జిఎఫ్ నిధులు పొందిందని నడ్డా ఆరోపించారు. ఆర్‌జిఎఫ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వార్షిక నివేదిక 2005-06  పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబార కార్యాలయంలను “భాగస్వామ్య సంస్థలు, దాతలు”లో జాబితాలో ఒకటిగా చేర్చారు. 


చట్టాలను ఉల్లంఘించినందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ 
ఎఫ్‌సీఆర్‌ఏ   లైసెన్స్‌లను రద్దు చేస్తూ హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి స్వాగతించింది. ఈ రెండు ఎన్జీవోలు గాంధీ కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నాయని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనా రాయబార కార్యాలయం నుండి ఈ సంస్థలకు మూడు సార్లు విరాళం అందిందని పాత్రా ఆరోపించారు.