దీపావళి ముందు రోజు అయోధ్యకు ప్రధాని

దీపావళి పూర్వ సంధ్య సందర్భంలో అక్టోబర్ 23వ తేదీ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ను సందర్శించనున్నారు. సాయంత్రం పూట 5 గంటల వేళలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, పూజా కార్యక్రమాలలో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు.
ఆ తరువాత శ్రీ రామ్ జన్మ్ భూమి తీర్థ్ క్షేత్రం స్థలాన్ని పరిశీలిస్తారు. సుమారు 5 గంటల 45 నిమిషాల కు శ్రీరామునికి ప్రతీకాత్మక రాజ్యాభిషేకాన్ని ఆయన నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల 30 నిమిషాల సమయం లో సరయు నది న్యూ ఘాట్ వద్ద జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి వీక్షిస్తారు.

అటు తరువాత ప్రధాన మంత్రి, వైభవోపేతమైనటువంటి ‘దీపోత్సవ్’ ఆరంభం అయినట్లుగా ప్రకటన చేస్తారు. ఈ సంవత్సరం దీపోత్సవ్ తాలూకు ఆరో సంచికను నిర్వహిస్తున్నారు.  తొలిసారిగా ప్రధాన మంత్రి ఈ సంబరాలలో స్వయంగా పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా 15 లక్షల కు పైగా ప్రమిదలను వెలిగించనున్నారు.

దీపోత్సవ్ లో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వేరు వేరు నృత్య రీతులను ప్రదర్శించేటటువంటి పదకొండు రామ్ లీల శకటాలతో పాటుగా మరో అయిదు చైతన్యవంతమైన శకటాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరయు నది తీరంలో గల రామ్ కీ పైడి ప్రాంతంలో ఒక గొప్ప సంగీత సహిత లేజర్ షో తో పాటు ఒక 3-డి హోలోగ్రాఫిక్ ప్రజెక్శన్ మేపింగ్ షో ను కూడా ప్రధాన మంత్రి చూస్తారు.