జెపి నడ్డాకు సమాధీ…. టిఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం 

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సమాధి నిర్మించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వాళ్లకు సమాధి కట్టడం టీఆర్ఎస్ సంస్కృతా…? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదన్నారు. 
 ‘‘బతికున్న వారికి సమాధులు కట్టి.. పసుపు కుంకుమ చల్లి నివాళులర్పించే నీచ, నికృష్టపు సంస్కృతికి టీఆర్ఎస్ పాల్పడుతున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్‌‌‌‌లో సమాధి కట్టి, అంత్యక్రియలు నిర్వహించి అవమానపరిచారు. ఇలాంటి వికృత, ఉన్మాద చర్యలకు అధికార పార్టీ తెర లేపింది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు.. మేం తెగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ ఇలాంటి చిల్లర వేషాలు వేయడం నీచమైన చర్య అని మండిపడ్డారు.
జేపీ నడ్డాకు సమాధి నిర్మించిన వారికి కనీసం సభ్యత, సంస్కారం లేదా? అని   ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు నైతిక విలువల్లేవని అంటూ మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెడితేనే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, మరి ఇప్పుడు నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ లీడర్లను ఏం చేయాలని ప్రశ్నించారు. 
‘‘మాకు సభ్యత, సంస్కారం ఉంది కాబట్టే.. మీరు ఎన్ని అప్రజాస్వామిక విధానాలకు పాల్పడినా, ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా సహనంతో ఉన్నాం. మేం కల్వకుంట్ల కుటుంబం కోసం పని చే యడం లేదు. దేశం కోసం పని చేస్తున్నాం. అందుకే మౌనంగా ఉంటున్నాం” అని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. పుత్ర వాత్సల్యం కోసం టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్ చేశారని, తెలంగాణ అనే పేరుతో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆ పదం లేకుండా చేశారని విమర్శించారు.
తెలంగాణను దోచుకున్నది సరిపోక, ఇప్పుడు దేశా న్ని దోచుకునేందుకు విమానం కొన్నారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘తెలంగాణలో కమీషన్ లేని కాంట్రాక్టే లేదు. టీఆర్ఎస్ నాయకులు దోచుకోని రంగమే లేదు. వారికి రియల్ ఎస్టేట్ సెక్టార్ బంగారు బాతులా మారింది. దోచుకోవడం, దాచుకోవడం.. అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖ ర్చు పెట్టడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం. నిజాం పాలనను తలపిస్తున్నారు” అని విమర్శించారు.
 
“మేం దేశం కోసం పనిచేస్తున్నామని కేసీఆర్‌ కుటుంబం కోసం కాదు” అని  ఆయన స్పష్టం చేశారు.  తాము తెగిస్తే మీరు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
టీఆర్ఎస్ వాళ్లు ఎన్ని చేసినా సహనంతో ఉంటున్నామని, తమ సహనాన్ని అసమర్థతగా చూడొద్దని హితవు చెప్పారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో మాఫియాలన్నీ కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.  దోచుకోవడం.. దాచుకోవడం టీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారిందని, కేసీఆర్ తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మునుగోడు ప్రజలు మంచి తీర్పును ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అది మునుగోడు ఫలితంలో ప్రతిబింబించనుంది. హుజూరాబాద్ ఫలితమే మునుగోడులో రానుంది. కేసీఆర్.. సీఎం హోదాలో ఉంటూ మునుగోడులో ఒక గ్రామానికి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉండడం ఏమిటి? దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు” అని పేర్కొన్నారు.