
ఇండిపెండెంట్లకు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను గౌరవ న్యాయస్థానం కొట్టేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన యారాగండ్లపల్లిలో మాట్లాడుతూ న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయంతో ఎదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుందని, మునుగొడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందని తెలిపారు
ఈ గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయని చెబుతూ ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో అని సంజయ్ నిలదీశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మర్రిగూడెం అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని సవాల్ చేశారు. ఇందుకు తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు.
రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందని పేర్కొంటూ గట్టుప్పల్ మండల ప్రకటన, 100 పడకల ఆసుపత్రి తిరిగి ఇక్కడకు వచ్చిందని చెప్పారు. అలాగే ఆసర పెన్షన్ ల తో పాటు ప్రభుత్వం ఎన్నో కేటాయిస్తోందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిని ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందని అంటూ 16 మంది మంత్రులు, 88 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మునుగోడులో మకాం వేశారని వివరించారు. ఇంతమంది గతంలో ఇక్కడకు వచ్చారా? అని నిలదీశారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారానికి గత ప్రధాని వాజ్ పేయి కృషి చేశారని వెల్లడించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు