జగన్ వైఫల్యాలపై త్వరలో మరో ఉద్యమం చేపట్టాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించింది. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని, భావితరాల భవిష్యత్తు ను అంధకారంలోకి తీసుకెళుతోందని, అప్పులు, అరాచకాలు తప్ప అభివృద్ధి జాడే కనిపించడంలేదని విమర్శించింది. డిసెంబరు నుంచి ప్రజల్లోకి వెళదామని, వైసీపీ ప్రభుత్వ విధ్వంసం గురించి ప్రజల కు చెబుదామని పిలుపిచ్చింది.
విజయవాడలో బీజేపీకి కోర్ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మురళీధరన్, రాష్ట్ర ప్రభారీ శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరిపి రాష్ట్రంలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఏ వర్గాన్ని పలకరించినా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోందని, రాష్ట్ర భవిష్య త్తు గురించి జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఈ సమావేశాల్లో వ్యక్తమైంది. అప్పులు చేయడం, బటన్ నొక్కి పంచి పెట్టడం తప్ప అభివృద్ధి జాడ ఎక్కడా కనిపించడం లేదని నేతలు విమర్శించారు.
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయని, దాడులు, విధ్వంసం తప్ప ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, ప్రాజెక్టుల ని ర్మాణం, మరమ్మతులు.. ఆఖరికి రోడ్లు సైతం రిపేరీ చేయలేని దారుణమైన స్థితిలో జగన్ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి రైతులు భూములు త్యాగం చేస్తే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ఉన్నది కూడా లేకుండా చేయడం దుర్మార్గమని పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఓట్లు కొనేందుకు జగన్ చేస్తోన్న ప్రయత్నం తప్ప ఏపీని ప్రగతి పథంలో నడిపే ప్రణాళిక లేనేలేదని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.
ఈ అరాచకాలను, దిశలేని పాలనను చూస్తూ వదిలేస్తే రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లోకి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులు, అప్పులు, అరాచకాలు అన్నీ తీసుకెళ్లి చైతన్యం తీసుకు రావాలని బీజేపీ తీర్మానించింది. కేంద్రం రాష్ట్రానికి గత ఎనిమిదేళ్లలో ఏమిచ్చిందో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గ స్థాయిలో పాదయాత్రలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
డిసెంబరు నుంచి చేయబోయే ఈ యాత్రల తేదీలు, రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వమే పోటీ ఉద్యమాన్ని ఏర్పాటు చేయించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దేశంలో ఏబీసీడీలుగా చీలిపోయి కనుమరుగైన కమ్యూనిస్టులు.. తమను ప్రజలు ఎందుకు వెలివేశారో అంతర్మథనం చేసుకోవాలని హితవు చెప్పారు.
జనసేన కార్యకర్తల అరెస్ట్ పై బిజెపి ఆగ్రహం
విశాఖలో జనసేన కార్యకర్తల అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్నిఖండిస్తూ ప్రభుత్వ చర్యలను బీజేపీ సహించదని స్పష్టం చేశారు. విశాఖలో పవన్ కల్యాణ్ కార్యక్రమం పది రోజుల ముందే ఖరారయ్యిందని, దీనిపై తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.
పోలీసులు అతి ఉత్సాహంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిని టచ్ చేసి కారులో కింద కోర్చోమనడం సహించరానిదని హెచ్చరించారు. పోలీసులు కూడా ఓవరాక్షన్ మానుకుంటే మంచిదని సూచించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం అయితే బీజేపీ ముందుండి ప్రత్యక్షంగా పాల్గొంటుందని సోము వీర్రాజు హెచ్చరించారు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్