భారత్, సౌతాఫ్రికా వన్డేల సిరీస్ భారత్ కైవసం 

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ని గెలిచి హీట్ పెంచిన సఫారీలు ఆ తర్వాత రెండో మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారు. 
 
ఇక ఇరు జట్లకు కీలకంగా మారిన మూడో మ్యాచ్లో అయితే  టీమిండియా బౌలర్ల దెబ్బకు క్రీజు వీడిచి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇందులో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి సఫారీల వెన్నువిరిచాడు.  ఈ క్రమంలో 50 ఓవర్ల మ్యాచ్ 26 ఓవర్లలోనే ముగిసింది. దీంతో 99 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్లో 100 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్ (8) పరుగులు మాత్రమే చేశాడు. శుభ్మన్ గిల్  ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయి ఆడి క్రికెట్ అభిమానులను అలరించాడు. గిల్కు తోడుగా వన్డౌన్లో ఇషాన్ కిషాన్ (10) క్రీజులోకి రావడంతో ఇద్దరు కలిసి కాసేపు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు.
కాగా 10వ ఓవర్లో భారత్ 98 పరుగుల వద్ద కిషన్ క్యాచ్ అవుటయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ 28, గిల్ 53 కలిసి మ్యాచ్ని ముగించేద్దామనుకుంటే 18వ ఓవర్ ఆఖరి బంతికి అంటే.. గిల్ 49 పరుగుల వద్ద రబడా వేసిన బంతితో ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది.
దీంతో టీమిండియా 18 ఓవర్లో 3వ వికెట్ కోల్పోయింది. టార్గెట్ని రీచ్ చేసే క్రమంలో ఆ తర్వాత సంజు శాంసన్ 2 రాకతో మ్యాచ్ 19వ ఓవర్లో ఫినిష్ అయ్యింది. మూడు వన్డేల మాస్టర్కార్డ్ సిరీస్ని భారత్ సొంతం చేసుకుంది.