ఆర్ఎస్ఎస్ పై తప్పుడు కధనంకు `మాతృభూమి’ క్షమాపణ!

ఆర్‌ఎస్‌ఎస్‌పై తప్పుడు విషయాలు ప్రచురించినందుకు కేరళలో మలయాళం వారపత్రిక `మాతృభూమి’ విచారం వ్యక్తం చేసింది.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటంలో ఓడిపోయిన తర్వాత `మాతృభూమి’ వారపత్రికలో క్షమాపణలు ప్రచురించారు.

ఇది అక్టోబరు 9, 2022 నాటి తన తాజా సంచికలో క్షమాపణ పత్రాన్ని ప్రచురించారు. “భీకరతుడే వైరస్” (ఉగ్రవాద వైరస్) కవర్ శీర్షికతో ప్రచురించినన కథనం వెలుగులో ఎడిటర్ క్షమాపణ చెప్పారు. ఇది ఫిబ్రవరి 27, 2011 నుండి మార్చి వరకు “ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం భారతదేశాన్ని మింగేస్తుందా?” అనే ఐదు కథనాల సిరీస్‌లో భాగం.

ఈ కథనాన్ని బద్రీ రైనా రచించారు. `మాతృభూమి’ క్షమాపణపై అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ పి. గోపాలన్‌కుట్టి మాస్టర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఎర్నాకులం అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతోంది. ఈ కధనం వాస్తవాలకు విరుద్ధం అని పేర్కొంటూ న్యాయవాది కె.కె. బరాలరామ్ మార్చి 19, 2013న `మాతృభూమి’కి లీగల్ నోటీసు పంపారు.

హర్యానాలోని పంచకుల చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు స్వామి అసీమానంద్ సమర్పించిన వాంగ్మూలం ఆధారంగా ఆ కధనాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. యుపిఎ హయాంలో ఆర్ఎస్ఎస్ ను కించపరచేందుకు జరిపిన కుట్రలో సృష్టించిన ఫోర్జరీ పత్రం అది. ఆ పత్రం వాస్తవం కాదని, బలవంతంగా సంతకం చేయించారని పేర్కొంటూ  2019లో స్వామి అసీమానంద్‌ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.  బద్రి రేనా తన పరిశోధనల ఆధారంగా కథనాన్ని రాశారని `మాతృభూమి’ ఆర్‌ఎస్‌ఎస్‌కు మొదటి పంపిన లీగల్ నోటీసులో పేర్కొంది.

`మాతృభూమి’ సమాధానం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ గోపాలంకుట్టి మాస్టర్ ఎర్నాకులం అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. `మాతృభూమి’ ప్రింటర్ & పబ్లిషర్ ఎం ఎన్  రవివర్మ, మేనేజింగ్ ఎడిటర్ పి.వి. చంద్రన్, ఎడిటర్ కె.కె. శ్రీధరన్ నాయర్, డిప్యూటీ ఎడిటర్ ఎం పి గోపీనాథ్, అసిస్టెంట్ ఎడిటర్ కమల్‌రామ్ సజీవ్, రచయిత బద్రి రైనా, అనువాదకుడు కె.పి.ధన్యలను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ `మాతృభూమి’ కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు దానిని తిరస్కరించింది. ఫిర్యాదుదారుకు కేసు దాఖలు చేసే హక్కు లేదని పేరొక్నటు ఆర్‌ఎస్‌ఎస్ నిర్వచించిన సంస్థ కాదన్న `మాతృభూమి’ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఎవరైనా తమ సంస్థను కించపరిచేలా కథనాలు ప్రచురిస్తే పరువు నష్టం కేసు దాఖలు చేసే హక్కు ప్రతి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

చట్ట ప్రకారం త్వరగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. `మాతృభూమి’ పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ సోఫీ థామస్ జనవరి 7న కీలక తీర్పు వెలువరించారు. అప్పుడు `మాతృభూమి’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది,

అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. పైగా,  ట్రయల్ కోర్టులో కేసును కొనసాగించాలని ఆదేశించింది. దీని ప్రకారం ఎర్నాకులం అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు కొనసాగింది. ఇంతలో, మాతృభూమి తమ కథనం వాస్తవంగా తప్పు అని అంగీకరిస్తూ క్షమాపణలను ప్రచురించింది.