అసమాన హస్తకళకు ప్రసిద్ధి హంపి విఠల మందిరం

బి. నరసింహమూర్తి 
హంపి‌ – విజయనగరం -4
హంపిలో విశాల విఠల మందిరం ప్రముఖ దర్శనీయ స్థలం. హంపిలోని విఠ్ఠల దేవాలయం ఒక పురాతన స్మారక చిహ్నం.  ఇది అసాధారణమైన వాస్తుశిల్పం, అసమానమైన హస్తకళకు ప్రసిద్ధి చెందింది. ఇది హంపిలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

విట్టల దేవాలయం విజయనగర దేవాలయాలలో అత్యంత అలంకారమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం అనేక ఆకర్షణలను కలిగి ఉంది.  ఇది పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన నిర్మాణం. వాస్తవానికి ఇది హంపిలో ఎక్కువగా సందర్శించే, హంపిలో అత్యధికంగా ఫోటోలు తీసిన ప్రదేశం. 

 ప్రసిద్ధి చెందిన విట్టల దేవాలయం 15వ శతాబ్దానికి చెందినది. ఇది విజయనగర సామ్రాజ్య పాలకులలో ఒకరైన రాజు II దేవరాయ (1422 – 1446) పాలనలో నిర్మించారు విజయనగర రాజవంశం అత్యంత ప్రసిద్ధ పాలకుడు కృష్ణదేవరాయ (1509 – 1529) పాలనలో ఆలయంలోని అనేక భాగాలు విస్తరించారు.  మెరుగుపరిచారు. ఈ ఆలయం విజయనగర కాలం నాటి శిల్పులు మరియు కళాకారులకు ఉన్న అపారమైన సృజనాత్మక, నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణగా నిలుస్తుంది.
 
 అక్కడికి‌ ఓ కిమీ దూరంలో‌ వాహనాలను ఆపేస్తారు. ప్రభుత్వ ఆటోలే దేవాలయం వద్దకు తీసుకెళ్తాయి. మేము నడుస్తూ వెళ్ళాము. తూర్పు ఈశాన్యంలొ విశాలమైన కోనేరు‌ కనపడుతుంది. చుట్టూ కొండలు, ఈ సంవత్సరం వర్షాలకు బాగానే నీరుంది.  
 
రోడ్డుకు ఎదురుగా పెద్ద గాలిగోపురం. పై‌నుండి‌ `వి’ ఆకారం లో పడిపోయి ఉంటుంది. బహమనీ సుల్తానులనే విదేశీ దోపిడీదారులు విజయనగరం‌ జయించి, దేవాలయాన్ని ఛిద్రం చేసారు.‌ కృష్ణదేవరాయలు ఒరిస్సా గజపతులను జయించాక ఈ ఆలయం కట్టారట. లోపల రాతి రథం‌ ఉంటుంది. 
 
కృష్ణదేవరాయల రెండవ భార్య రాణి చిన్నా దేవి మంచి నాట్యం చేసేదట. ఈ కృష్ణుడి‌ముందు విశాల నాట్యమందిరం‌ ఉంది.‌ దానిపైన కర్రతో‌ వేసిన రూఫ్ పైన రాళ్ళు పరచి అచ్చాదన చేసారు. గొప్ప శిల్ప కళతో ఆ మందిరం గోచరిస్తుంది. విదేశీ ఆక్రమణదారులైన ముస్లిములకు ఈ మందిరం‌ ఇలా ఉండటం సహించక కాల్చి వేసి పగులగొట్టారట. ఆ రాళ్ళు కూడా పడిపోతున్నాయని అందులోకి సందర్శకులను రానివ్వటం‌లేదు. 
 
వెనుక ఉన్న విఠలుడి ఆకారం పండరీపురం లోని పాండు రంగని పోలి ఉంటడేదని అక్కడి స్థంభాలపై అది ద్యోతకమవుతుంది. గర్భగుడిలో ప్రదక్షిణం కోసం ఓ నాలుగు మెట్లు దిగి స్వామి‌పాదాలకు ప్రదక్షిణ చేసే క్రమం అక్కడ ఉంటుంది. కృష్ణుడి విగ్రహం‌ అక్కడ లేదు. కాబట్టి చెప్పులతో వెళ్ళొచ్చని గైడ్ చెబుతాడు. 
 
ఈ ఆలయం ఆవల గుర్రాల వ్యాపారం సాగేదట. అక్కడి గోడలపై అరేబియా, మంగోలియా ఇతర దేశాల అలంకారలతో బేరగాళ్ళ బొమ్మలు కూడా కనపడతాయి. ఆయా రకాల గుర్రాల శిల్పాలూ కనపడతాయి.
 
మా మేనత్తతో మేము హంపికి వెళ్ళామని చెప్పాను. నేనూ రెండు సార్లు చూసాను. ఏముంది అక్కడ అన్నీ రాళ్ళ కుప్పలేకదా ! అంది. స్వతంత్ర భారతంలో ఆ దేవాలయాన్ని‌ పునరుద్దరణ చేసుకోలేమా? మరో విగ్రహం‌ ప్రతిష్ట చేసుకోలేమా? లేము. ఎందుకంటే అది పురావస్తు‌ శాఖ‌ అధీనం‌లో ఉంది. దానికి గుర్తింపు అంతర్జాతీయ సంస్థల చేతుల్లో ఉంది. 
 
అక్కడ కూడా దేవాదాయ శాఖ కబంధ హస్తాలు చాచబడ్డాయి. వేటినీ‌ముట్టుకోలేము. బాగు చేసుకోలేము. దేనికీ హిందువులకు అధికారంలేదు. పడిపోయిన ఆ గాలిగోపురం పడిపోయి, నాట్య మందిరం పగలిపోయి మనం‌ నిరంతరం‌ విదేశీ ముస్లిం దోపిడీదారుల చేతిలో ఓడిపోయినామనే పరాజయ చరిత్ర కనపడుతుండాలనే దృష్టి మన ప్రభుత్వానిమెందుకు ? 
 
వాటి ఫోటోలు‌ మన చరిత్రకు సాక్ష్యాధారాలు అవుతాయి. దాన్ని‌ పునర్మించు కోవటానికి ఆటంకం‌ మన ప్రభుత్వమే ! మన చట్టాలే! ఆ శిల్ప సంపద, ఆ దేవాలయాలు మట్టి కలిసి పోవలసిందేనా?