గాంధీ మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్, హైదర్ గూడలోని భారత్ ఖాదీ వస్త్రాలయాన్ని ఆయన సందర్శించి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు.
విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువులను వినియోగించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపును మోదీ వంద శాతం పాటిస్తున్నారని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఎన్నో వస్తువులు తయారవుతున్నాయని గుర్తు చేశారు. గతంలో ఏ చిన్న వస్తువునైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు సెల్ ఫోన్ల నుంచి రాకెట్ దాకా ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు.
కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్డారని, కానీ దేశీయంగా తయారైన వ్యాక్సిన్ తో కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మనవైపు చూస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దీనంతటికీ ప్రధాని మోదీ నాయకత్వమే కారణమని తెలిపారు. దేశంలోని ప్రజలంతా స్వదేశీ వస్తువులను వినియోగించాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?