అణ్వస్త్రాల సాధనలో మృత్యువాత పడిన లాల్ బహదూర్ శాస్త్రి

* జన్మదిన నివాళి 
భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పని చేసింది చాలా తక్కువ కాలమే. కానీ అసాధారణమైన కృషి సాగించారు. ఒక వంక దుర్భుద్ధితో యుద్దానికి దిగిన పాకిస్థాన్ కు గుణపాఠం నేర్పారు. మరో వంక భారత వ్యవసాయ విప్లవంపై నాంది పలికారు. ఇంకోవైపు భారత్ అణ్వాయుధాలు సమకూర్చుకోవడం ద్వారా రక్షణ  పరంగా దుర్భేద్యంగా రుపొందాలని ప్రయత్నాలు ప్రారంభించారు. 
 
వాస్తవానికి ఆయనకు మిగిలిన ప్రధానుల వలే ఎన్నికలలో ఓట్లు తీసుకు రాగాల విశేషమైన ప్రజాదరణ లేదు. సొంత పార్టీలో అత్యధికుల మద్దతు లేదు. కేవలం `కీలుబొమ్మ’గా ఉండగలరనే  ఆయనను పార్టీలో సీనియర్లు ప్రధానిగా ఎంచుకున్నారు. అయితే దృఢసంకల్పం ఉంటె మరేమి అడ్డురావని నిరూపించారు. 
 
ఆయన మృతి తొలి నుండి అనుమానాస్పదంగా ఉంటున్నప్పటికీ ఏ విధంగా జరిగిందే ఈ మధ్యనే వెల్లడైనది. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించారని, దానికి అడ్డుకట్ట వేయడం కోసమే ఆయనతో పాటు అణ్వయుధాల రూపకల్పనలో నిమగ్నమైన హామీ బాబాను కూడా అమెరికా నిఘా సంస్థ సిఐఎ కుట్రపూరితంగా హతమార్చినట్లు బహిర్గతమైంది. 
 
భారత్‌ బలమైన దేశంగా ఎదగకుండా చేయడం కోసం మొదటినుండి అమెరికా ఎన్నో పన్నాగాలు పన్నుతూ వస్తున్నది.  నెహ్రూ హయాంలో అమెరికాలో పందులు కూడా తినని నాసిరకపు గోధుమలను మనకు  చేసింది.  ఆరోగ్యానికి, పంటలకు, వ్యవసాయానికి,  నేలకి చాలా ప్రమాదకరమైన పార్థీనియం గడ్డిని మన దేశంలో ప్రోత్సహించడం ద్వారా మన వ్యవసాయ భూములను కలుషితం చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యాన్ని కృంగదీసే ప్రయత్నం చేసింది.

సిఐఎ  డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్‌లో సెకండ్-ఇన్-కమాండ్ అయిన రాబర్ట్ క్రౌలీ (కోవర్ట్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్) గురించి ప్రముఖ రచయిత గ్రెగొరీ డగ్లస్ రాసిన ‘కాన్వర్సేషన్ విత్ ది క్రో’ అనే పుస్తకంలో ఇటీవలనే శాస్త్రి, హోమీబాబాల హత్యకు కుట్ర చేసిన్నట్లు వెల్లడైనది.  సిఐఎ భారతదేశ అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ భాభా, ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిలను చంపిందని క్రౌలీ అంగీకరించాడని ఆ రచయిత స్పష్టంగా తెలిపారు.
 
అమెరికా ఆధిపత్యంకు భవిష్యత్ లో అడ్డుగా నిలుస్తారని అనుకున్న వారిని అడ్డు తొలగించుకునేందుకు రహస్య ఆపరేషన్లు చేయడంలో  సిఐఎ చాలా అపఖ్యాతి పాలయింది. బలమైన భారత దేశ నిర్మాణంలో ప్రాణాలను విడిచిన ఆ మహానేత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ శాస్త్రీ 1904 అక్టోబర్ 2 న శారదా ప్రసాద్ రాయ్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు.
తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది.
నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేది కాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు.
దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్ బహదూర్ తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు.
 
1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడం ప్రారంభించాడు. అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్ర్యోద్యమ పోరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపారు. సత్యాగ్రహ ఉద్యమము తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.
 
స్వాతంత్ర్యం తరువాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 
 
సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు. 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది.
ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తర్వాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ (హరిత) విప్లవానికై బాటలు పరిచారు. 1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్మూకాశ్మీర్లోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది.
పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా ఆయనపై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మరునాడు, 1966 జనవరి 10న మృతిచెందారు.
ఆ తర్వాత రెండు వారాలకు హామీ బాబా విమాన ప్రమాదంలో మృతి చెందారు. హోమీబాబా స్వతంత్రం రాకముందు ఉండే భారత్ అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలని వాదిస్తూ ఉండేవారు. అందుకోసం పరిశోధనలు కూడా ప్రారంభించారు.
 మృతి చెందేనాటికి లాల్ బహదూర్ కు ఓ సొంత ఇల్లు గాని, సొంత కారు గాని లేవు. ఓ కారున్నా బ్యాంకు అప్పుతో తీసుకొని,  ఇంకా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఆయన దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఆయన మరణించిహ్నాప్పుడు అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కూడా ఇంట్లో లేదని ఎంత నిరాడంబరంగా జీవించారో తెలుస్తుంది.