ఐక్యరాజ్యసమితి వేదిక నేపథ్యంలో మహాత్మా గాంధీ విద్య ప్రాధాన్యతపై వెలువరించిన మాటలు సందేశంగా ప్రత్యక్షంగా వినిపించారు. గాంధీజి జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం, యునెస్కో మహాత్మా గాంధీ ఇనిస్టూట్ ఆఫ్ పీస్, డెవలప్‌మెంట్ (ఎంజిఐఇపి) సంయుక్తంగా బృందాల వారి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ దశలో గాంధీ ప్రత్యేక నిలువెత్తు 3 డి ఎఫెక్ట్ విద్యుత్‌కాంతుల భరిత హాలోగ్రామ్ ప్రత్యక్షం అయింది.
ఇదే సమయంలో గాంధీజీ అక్షరాస్యత గురించి చెప్పిన మాటలను మైక్‌లో విన్పించారు. గాంధీనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతిని కల్పించారు. ‘అక్షరాస్యత అనేది విద్యాకు అంతం కాదు ఆరంభం కాదు. విద్య ద్వారా బాలల్లోని బహుముఖ ప్రతిభను ఆవిష్కరించేందుకు వీలేర్పడుతుంది’ అన్న గాంధీజీ మాటలను వినిపించారు.
అట్లాగే, “దేహం, మనస్సు, మేధస్సు సమన్వయం అనేది హృదయపూర్వక అభ్యాసం లేదా అధ్యయనం అంటే విద్య దీనినే తాను ఆధ్మాతిక శిక్షణ అంటానని, దీని ద్వారానే దేహం, మేధస్సు, మనస్సు మధ్య సమన్వయం సాధించినట్లు అవుతుంది. పరిపూర్ణం సిద్ధిస్తుంది’ అని గాంధీజీ పేర్కొన్న మాటలను విన్పించారు.
More Stories
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు