ఆర్థిక వ్యవస్థతో పాటు జీవావరణాన్ని కూడా పటిష్ట పరుచుకుంటున్న భారత్

భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా తన జీవావరణాన్ని కూడా అదే పనిగా పటిష్ట పరచుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశం లో అడవుల విస్తీర్ణం పెరిగడమే కాకుండా మాగాణి నేలలు సైతం త్వరిత గతిన విస్తరిస్తున్నాయని ఆయన తెలిపారు.

పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశం గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో రెండు రోజులపాటు జరుగుతున్న పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని  వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా శుక్రవారం ప్రారంభిస్తూ గత కొన్నేళ్ళ లో గీర్ సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు, చిరుత పులుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందిందని చెప్పారు.

నెట్ జీరో లక్ష్యాన్ని 2070వ సంవత్సరానికల్లా సాధించాలని పేర్కొంటూ ప్రస్తుతం మన దేశం దృష్టి `హరిత వృద్ధి’ (గ్రీన్ గ్రోత్), `హరిత ఉపాధి’ (గ్రీన్ జాబ్స్) మీద కేంద్రీకృతం అయింది ప్రధాని వెల్లడించారు. ప్రకృతితో సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

ఈ లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాల పర్యావరణ శాఖల పాత్ర ను కూడా కీలకమైనదని  ఆయన స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాలలో ఒక వృత్తాకార ఆర్థిక వ్యవస్థను వీలైనంత మేరకు ప్రోత్సహించాలి అని పర్యావరణ మంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధి ప్రచార ఉద్యమాన్ని చెప్పుకోదగినంతగా పటిష్ట పరచగలదని తెలిపారు.

అంతేకాకుండా, ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ బంధనాల బారి నుండి మనకు విముక్తి ని ప్రసాదిస్తుందని కూడా నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖల భూమికల పాత్రను ఒక గిరి గీసిన పద్ధతిలో చూడకూడదని ప్రధాని స్పష్టం చేశారు. పర్యావరణ శాఖలు చాలా కాలం గా ఒక నియంత్రణ వ్యవస్థ వలె నడుచుకొన్నాయని విచారం వ్యక్తం చేశారు.

‘‘పర్యావరణ మంత్రిత్వ శాఖ భూమిక అనేది పర్యావరణం తాలూకు ఒక నియంత్రణదారు సంస్థ కంటె పర్యావరణానికి ఒక ప్రమోటరుగా ఉండడం అనేది ముఖ్యం అని నేను అనుకొంటున్నాను’’ అని ఆయన తెలిపారు. వెహికల్ స్క్రేపింగ్ పాలిసి, ఇథెనాల్ ను కలపడం వంటి బయో ఫ్యూయల్ సంబంధి చర్యలను అమలుపరుస్తూ ముందుకు సాగిపోవడం వంటివి అవలంబించవలసిందిగా రాష్ట్రాల ను ఆయన కోరారు.

ఈ విధమైన చర్యల ను ప్రోత్సహించడం లో రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ సైతం ఉండాలంటూ ప్రధాని మోదీ  సూచనలు చేశారు. ఒకప్పుడు సమృద్ధిగా జలం ఉన్నటువంటి రాష్ట్రాలు సహితం ఇటీవల నీటి ఎద్దడిని కూడా ఎదుర్కొంటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేసారు.

రసాయనిక పదార్థాలకు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయం, అమృత్ సరోవరాలు, జల సంబంధి భద్రత వంటి సవాళ్ళు, చర్యలు అనేవి ఆయా విభాగాలకు మాత్రమే పరిమితం కాకూడదని ప్రధాని స్పష్టం చేశారు. ఆయా విభాగాల కు తోడు పర్యావరణ విభాగం కూడా వీటిని అంతే ప్రముఖమైన సవాళ్ళుగా ఎంచాలి అని ఆయన సూచించారు.

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ అమలు లోకి వచ్చిన ప్పటి నుండి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల లో సమన్వయం అధికం అయిందని చెబుతూ   అనేక ప్రాజెక్టులు జోరు అందుకొన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ అనేది పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక గొప్ప ఉపకరణంగా కూడా ఉంది అని ఆయన చెప్పారు. విపత్తులు వాటిల్లితే వాటికి ఎదురొడ్డి నిలచే తరహా మౌలిక సదుపాయాలు నెలకొనాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు.