విశ్వకర్మ జయంతి గౌరవ, నైపుణ్యాల ప్రతిష్ఠకు సంబంధించిన పండుగ

విశ్వకర్మ జయంతి అనేది గౌరవ ,నైపుణ్యాల ప్రతిష్ఠకు సంబంధించిన పండుగ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగిస్తూ ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని తయారు చేయడాన్ని సాదృశ్యంగా చిత్రీకరిస్తూ, ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను గౌరవించడం , గుర్తించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.

“విశ్వకర్మ జయంతి అనేది నిజమైన అర్థంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి గౌరవం, ఇది శ్రమ దినం” అని  అంటూ,  “భారతదేశంలో, శ్రామికుడి నైపుణ్యంలో భగవంతుడి రూపాన్ని మనం ఎల్లప్పుడూ చూశాము, వారు విశ్వకర్మ రూపంలో కనిపిస్తారు. వారు కలిగి ఉన్న నైపుణ్యంలో ఎక్కడో ఒక చోట దేవుని రూప రేఖ ఉంటుంది.  విశ్వకర్మకు ఈ కార్యక్రమం  ‘కౌశలాంజలి’ వంటి ఒక భావోద్వేగ నివాళి లాంటిదని నేను భావిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

21వ శ తాబ్దంలో భారత దేశం పురోగతి సాధిస్తున్నప్పుడు, పారిశ్రామిక శిక్షణ సంస్థకు చెందిన 9 లక్షల మందికి పైగా విద్యార్థుల స్కిల్ స్నాతకోత్సవం సందర్భంగా ఈ రోజు చరిత్ర సృష్టించడం జరిగిందని, 40 లక్షల మందికి పైగా విద్యార్థులు మనతో వర్చువల్ గా కలిసి ఉన్నారని ప్రధాని తెలిపారు. విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఆవిష్కరణ బాటలో తొలి అడుగు వేస్తున్నారని చెప్పారు.

 “మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, రేపటికి మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను నమ్మకంగా చెప్పగలను” అని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  విశ్వకర్మ స్ఫూర్తితో భారత దేశం కొత్త పథకాలను ప్రారంభించిందని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ‘ శ్రమ ఏవ జయతే’ అనే సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి వివరించారు.

“ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా తీర్చిదిద్దడానికి భారత దేశ యువత విద్యతో పాటు నైపుణ్యాలలో కూడా అంతే ప్రావీణ్యం సాధించాలి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. యువత లో నైపుణ్యాల అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని  మోదీ తెలిపారు.

‘’మన దేశంలో తొలి ఐటీఐ ని 1950లో ఏర్పాటు చేశారు. తరువాతి ఏడు దశాబ్దాలలో 10 వేల ఐటిఐలు ఏర్పడ్డాయి. మా ప్రభుత్వం 8 సంవత్సరాలలో దేశంలో సుమారు 5 వేల కొత్త ఐటిఐలను ఏర్పాటు చేసింది. గ త 8 సంవత్సరాలలో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు కూడా ఐటిఐ లకు చేరాయి” అని ప్రధాన మంత్రి చెప్పనారు.

జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ , వేలాది నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను  కూడా ఐటిఐల తో పాటు దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. పాఠశాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం 5000 కు పైగా స్కిల్ హబ్ లను కూడా తెరవబోతోందని ప్రధాన మంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేసిన తర్వాత, అనుభవం ఆధారిత అభ్యసనను కూడా ప్రోత్సహిస్తున్నారని,  పాఠశాలల్లో నైపుణ్య కోర్సులను ప్రవేశపెడుతున్నారని వివరించార.

10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత ఐటిఐ కి వచ్చే వారు 12వ క్లియరింగ్ సర్టిఫికేట్ ను నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా సులువుగా పొందుతారని విద్యార్థులకు తెలియచేయడానికి సంతోషిస్తున్నామని చెప్పారు.  “ఇది తదుపరి అధ్యయనాలలో మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది” అని పేర్కొంటూ ఐటిఐల నుండి సాంకేతిక శిక్షణ పొందిన యువతను సైన్యంలోచేర్చుకోవడానికి ఒక ప్రత్యేక సదుపాయం ఉందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.

నాల్గవ పారిశ్రామిక విప్లవ శకం  ‘పరిశ్రమ 4.0’ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారత దేశ విజయంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని చెప్పానారు. కాలానుగుణంగా ఉద్యోగ స్వభావం మారుతోందని, అందువల్ల మన ఐటిఐలలో చదివే విద్యార్థులు కూడా ప్రతి ఆధునిక కోర్సు సౌకర్యాన్ని పొందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆయన చెప్పారు.

ఈ కోర్సుల లభ్యత గురించి వివరిస్తూ, ఐటిఐల్లో కోడింగ్ , ఏఐ, రోబోటిక్స్ , 3డీ ప్రింటింగ్ , డ్రోన్ టెక్నాలజీ, టెలి మెడిసిన్ కు సంబంధించిన అనేక కోర్సు లను ప్రారంభించామని మోదీ వివరించారు. పునరుత్పాదక  ఇంధనం,  సౌర విద్యుత్, విద్యుత్ వాహనాల రంగంలో భారత దేశం ముందంజలో ఉన్నందున అటువంటి రంగాలకు సంబంధించిన కోర్సులు మన అనేక ఐటిఐల లో ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు.

‘’మీలాంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించడం సులభం అవుతుంది ‘’ అని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.  ప్రతి గ్రామానికి ఆప్టిక ల్ ఫైబర్ ను అందించడం, లక్ష ల కొద్దీ కామన్ స ర్వీస్ సెంటర్ల ను ప్రారంభించడం వంటి ఇటీవల జరిగిన మార్పుల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దేశంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం వల్ల ఉద్యోగ అవకాశా లు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. 

 ఐటిఐల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామాల్లో మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. “ఇది గ్రామంలో మొబైల్ రిపేర్ పని కావచ్చు లేదా వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పని కావచ్చు, ఎరువులను పిచికారీ చేయడం కావచ్చు లేదా డ్రోన్ల సహాయంతో ఔషధాలను సరఫరా చేయడం కావచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇటువంటి అనేక కొత్త ఉద్యోగాలు జోడించబడుతున్నాయి” అని ప్రధాన మంత్రి వివరించారు.