19న బీజేపీలో కెప్టెన్ అమరీందర్ పార్టీ విలీనం

పంజాబ్‌  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ () తన ”పంజాబ్ లోక్ కాంగ్రెస్” పార్టీని సెప్టెంబర్ 19న బీజేపీలో విలీనం  చేయనున్నారు. అంతేకాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో ఆయన చేరనున్నారు. 
 
గత ఏడాది ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అమరీందర్ సహా పీఎల్‌సీ అభ్యర్థులంతా చిత్తుగా ఓడిపోయారు.
కాగా,  కెప్టెన్‌తో ఆయన పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్ కూడా బీజేపీలో లాంఛనంగా బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అమరీందర్ ఇటీవల వెన్నెముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నారు.
 ఒకప్పటి పాటియాలా రాజకుంటానికి చెందిన అమరీందర్ రెండు సార్లు పంజాబ్ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత సొంతంగా పీఎల్‌సీ పార్టీని ఏర్పాటు చేసి బీజేపీ, సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.