
మాజీ వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధించింది. బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79 కోట్లు తీసుకొని గీత ఎగ్గొట్టారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్టక్చర్ పేరుతో గీత దంపతులు రుణం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 2015లో కేసు రిజిష్టర్ అయిన తర్వాత సుదీర్ఘంగా వారికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. విచారించి చార్జిషీటును దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ మేరకు వారికి జైలు శిక్ష విధించింది. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వీరిని అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.
More Stories
సైబర్ నేరాలపై ఆర్బిఐ ప్రత్యేకంగా బ్యాంక్.ఇన్ డొమైన్
వందే భారత్ రైలులో ఆన్‌బోర్డ్‌లో కూడా ఆహారం
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు