
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్- కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరికి లిజ్ ట్రస్‌నే విజయం వరించింది. రిషిపై ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లిజ్ బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు సాధించేందుకు సిద్ధమయ్యారు.
మంగళవారం, ఆమె క్వీన్ ఎలిజబెత్‌ను కలవడానికి స్కాట్లాండ్‌కు వెళతారు. ఆమె కొత్త నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆమెను రాణి ఆహ్వానిస్తారు.
లీజ్ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్ నెగ్గినట్లయ్యింది. ఆన్‌లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్, ఆమెకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఈ పోరులో లిజ్ ట్రస్ గెలుపు ఖాయమంటూ సర్వేలన్నీ స్పష్టం చేశాయి.
“కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకోన్నందుకు నేను గౌరవించబడ్డాను. మన గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి, అందించడానికి నాపై మీ విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయాల్లో మనందరినీ ముందుకు తీసుకురావడానికి, మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేను సాహసోపేతమైన చర్య తీసుకుంటాను. యునైటెడ్ కింగ్‌డమ్ సామర్థ్యాన్ని బయటపెట్టండి” అని ఎన్నికల ఫలితం అనంతరం ట్రస్ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ అభినందన
కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు లిజ్ ట్రస్‌ను తమ ప్రధాన మంత్రిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్న వెంటనే భారత ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు: “యుకె తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు అభినందనలు లిజ్ ట్రస్. మీ నాయకత్వంలో, భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం ఉంది. మీకు శుభాకాంక్షలు మీ కొత్త పాత్ర, బాధ్యతలకు ఉత్తమమైనది.”
2015 ఎన్నికల తర్వాత లిజ్ ట్రస్ కన్వర్వేటివ్ పార్టీ నుంచి ఆమె నాలుగో ప్రధాని కావడం గమనార్హం. కొత్త ప్రధానిగా లిజ్ ముందు బోల్డన్ని సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ను ఇప్పుడు ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. జులైలో ఇది ఏకంగా 10.1 శాతాన్ని తాకింది. ఇప్పుడీ సంక్షోభం నుంచి దేశాన్ని ట్రస్ ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరమే.
కాగా, బ్రిటన్‌కు లిజ్ మూడో మహిళా ప్రధాని. ఆమె కంటే ముందు మార్గరెట్ థాచర్, థెరెస్సా మే ప్రధానులుగా పనిచేశారు. కాగా, మాజీ ఆర్థిక మంత్రి అయిన రిషి సునాక్ తొలుత బాగానే పోటీ ఇచ్చారు. లిజ్‌ను వెనక్కి నెట్టేసి ఒకానొక దశలో ప్రధాని కావడం ఖాయమన్న సంకేతాలు పంపారు.
అయితే, చాలామంది లిజ్ ట్రస్‌కే మద్దతు ఇచ్చారు. దీనికితోడు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లిజ్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు