రాత్రి వేళ మచిలీపట్నం – కర్నూల్ సిటీ ప్రత్యేక రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల అవసరాలను తీర్చేవిధంగా ముఖ్యంగా సెలవు రోజులలో డిమాండ్‌ మార్గాల్లో ప్రత్యే క రైలు సర్వీసులను నడుపుతోంది. కఅష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, పల్నాడు , ప్రకాశం జిల్లాల ప్రజలు రాయలసీమ ప్రాంతానికి
సౌకర్యవంతంగా రాత్రి వేళల్లో ప్రయాణించవచ్చు. 
 
తదనుగుణంగా ఇప్పుడు సవరించిన సమయాల ప్రకారం కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రయాణికులు రాత్రి వేళల్లో ఈ రైలు ఎక్కి డోన్‌ , కర్నూలు సిటీ మొదలగు రాయలసీమ ప్రాంతాలకు తెల్లవారుజామున చేరుకోవచ్చు.ఈ దిశలో రాయలసీమ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా మచిలీపట్నం సిటీ ట్రై – వీక్లీ ప్రత్యేక రైలు సమయాలను జోన్‌ సవరించింది.

ట్రైన్‌ నెం. 07067 మచిలీపట్నం – కర్నూల్‌ ప్రత్యేక రైలు మచిలీపట్నం నుండి ప్రతి మంగళవారం, గురువారం, శనివారం గతంలో 15.50 గంటలకు బయలుదేరేది. ఇప్పుడు అవే రోజుల్లో 17.00 గంటలకు బయలుదేరి కర్నూలు సిటీకి 06-30 గంటలకు చేరుకుంటుంది. 
 
ఇది మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సా రావుపేట, మార్కాపురం వద్ద ఈ రైలు ఎక్కే ప్రయాణికులు రాత్రి వేళల్లో ప్రయాణించి రాయలసీమ ప్రాంతంలోని థేన్‌ , కర్నూలు సిటీకి ఉదయం పూట చేరేలా ప్రయాణ సమయాలు అనుకూలంగా ఉంటాయి.

ఈ రైలులో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా ఏసీ టూ టైర్‌ కోచ్‌, స్లీపర్‌ క్లాస్‌ కోచులు , సెకండ్‌ జనరల్‌ క్లాస్‌ కోచులు ఉంటాయి. ఈ రైలు తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా కర్నూలు సిటీలో 20.00 గంటలకు బయలుదేరి మచిలీపట్నంకు 07.05 గంటలకు చేరుకుంటుంది.

తెలిపిన విధంగా ట్రైనె నెం. 07067 మచిలీపట్నం -కర్నూల్‌ సిటీ సవరణ సమయాలు ఆగష్టు 27  నుండి అమలులోకి వస్తాయి.రాత్రి వేళల్లో అనుకూలంగా ఉండేలా రైళ్ల సమయాలు ఉండాలని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన స్థానికలు కోరుతూ ఉండడంతో ఈ మార్పులు చేశారు.