దండిగా గోధుమల నిల్వలు… దిగుమతుల ఆలోచనే లేదు

దేశంలో దండిగా గోధుమల నిల్వలు ఉన్నాయని, గోధుమల దిగుమతి ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వ కేంద్ర ఆహార ప్రజా పంపిణీ విభాగం తెలిపింది.
ఆహార ధాన్యాల దిగుమతుల కోసం ఉత్పత్తిపై కోతలు, వడగాల్పుల కారణంగా పెరుగుతున్న ధరలను పరిగణలోకి తీసుకోవాలన్న బ్లూమ్‌బర్గ్‌ నివేదికను కేంద్రం  ఖండించింది. భారత్‌లోకి గోధుమలను దిగుమతి చేసుకోవాలన్న ఎలాంటి ప్రణాళిక లేదని,ఫుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( ఎఫ్‌సిఐ) వద్ద దేశ అవసరాలను తీర్చే గోధుమ నిల్వలు ఉన్నాయని, అలాగే ప్రజలకు సరఫరా చేయడానికి సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చింది.
 
 ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధాన్యాల ఉత్పత్తిదారు 2022లో 106.84 మిలియన్‌ టన్నుల గోధుమలను పండించారని, ఇది మునుపటి అంచనా 106.41 మిలియన్‌ టన్నుల కన్నా కొంచెం అధికమని వ్యవసాయ శాఖ విడుదల చేసిన అంచనాలో ప్రభుత్వం తెలిపింది.
అమెరికా అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన విదేశీ అగ్రికల్చరల్‌ సర్వీస్‌ 99 మిలియన్‌ టన్నులుగా అంచనా వేసింది.అయితే వడగాల్పుల కారణంగా ఉత్పత్తి 95మిలియన్‌ టన్నులకు పడిపోయిందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. భారతదేశంలో వరి గోధుమలు జనాలకు ప్రధాన ఆహారంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాదిలో ఎక్కువగా ప్రజలు గోధుమరొట్టెలు ఆహారంగా తీసుకుంటారు.