 
                సరిహద్దులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే  దేశం సంపూర్ణ సామర్థ్యాన్ని సాధిస్తుందని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మణిపూర్ లోని మంత్రిపుఖ్రీ ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) హెడ్క్వార్టర్స్ ని శుక్రవారం సందర్శించిన ఆయనఅస్సాం రైఫిల్స్,  రెడ్ షీల్డ్ డివిజన్ కి చెందిన సైనికులతో మాట్లాడారు.
క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల రూపంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి సైనికులు  మణిపూర్లో భద్రతా పరిస్థితిని మెరుగుపరచడంలో విజయం సాధించారని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.  అధికారులు, సైనికులు ధైర్యంగా, దృఢ నిశ్చయంతో  విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.  భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ దళాల మధ్య నిలబడటం గర్వంగా ఉందని  ఆయన చెప్పారు.
1971 యుద్ధ సమయంలో ఏర్పడిన రెడ్ షీల్డ్ డివిజన్ శ్రీలంకలో ఐపికేఎఫ్ కార్యకలాపాల్లో విశేష సేవలు అందించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రెడ్ షీల్డ్ డివిజన్ సిబ్బంది అంకితభావంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. అంతర్గత భద్రత, ఇండో-మయన్మార్ సరిహద్దులు రక్షించడం, ఈశాన్య ప్రాంతాలను జాతీయ స్రవంతిలోకి తీసుకురావడంలో గత ఏడు దశాబ్దాలలో అస్సాం రైఫిల్స్ అద్భుతమైన కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు.
“ఈ కారణంగా, మీరు ‘ఈశాన్య ప్రజల స్నేహితులు’, ‘ఈశాన్య ప్రాంత రక్షకులుగా గుర్తింపు పొందారు ” అని రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అచంచలమైన అంకితభావంతో విధులు నిర్వర్తించి జాతీయ జెండా గౌరవాన్ని ఉన్నతిని రక్షించాలని బలగాలను ఉద్బోధించారు.





More Stories
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్లో మరో శీష్ మహల్
స్వామి దయానంద సరస్వతి దార్శనికుడు