జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అమర్‌నాథ్ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కూడిన బస్సు చందన్‌వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్‌లాన్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది.
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు.ప్రమాదం సమయంలో బస్సులో 39 మంది ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కాగా..మరో ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు. ఈ ప్రమాదంలో ఐటీబీపీ జవాన్లు ఆరుగురు మరణించారు. అమర్‌నాథ్ లో బందోబస్తు విధులు నిర్వర్తించి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు చందన్వారి నుంచి శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్తుండగా నదిలో పడింది.

More Stories
యోగ కేవలం యోగాసనాలు మాత్రమే కాదు
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్
టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు అమ్మకం.. విద్యార్థి అరెస్ట్