రాయల పాలన స్ఫూర్తి దాయకం

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ క్రిష్ణదేవరాయలు సాగించిన పరిపాలన తరతరాలకు స్ఫూర్తి దాయకమని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి చెప్పారు. రాయల వారి 513 వ పట్టాభిషేక మహోత్సవం గోరంట్ల విజయనగర్ లో మైనా స్వామి అధ్యక్షతన ఆదివారం జరిగింది. 
 
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రిష్ణరాయలు కొనసాగించిన వ్యవసాయాభివృద్ధి, నీటి వనరుల కల్పన, తెలుగు భాష – సంస్కృతి, కళలు – ఆలయాల అభివృద్ధి, పాటించిన రాజనీతి తదితర అంశాలను నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకొంటే ఆధునిక సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 
 
తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడితి, ఉన్నతమైన సమాజం రూపుదిద్దు కొంటుందని మైనస్వామి తెలిపారు. తెలుగులో ‘ఆముక్త మాల్యద’ కావ్యాన్ని రాసిన శ్రీ క్రిష్ణదేవరాయలు తాను తెలుగు వల్లభుడని, దేశ భాషలందు తెలుగు లెస్స అని కొడియాడాడని పరిశోధకుడు పేర్కొన్నారు. 
 
క్రీస్తుశకం 1509 ఆగస్ట్ 7న పట్టాభిషిక్తుడైన రాయలవారు 1529 అక్టోబర్ వరకు తమైన, ప్రజారంజక అద్భుత మైన పాలనను అందించారని కొనియాడారు. పులేరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంద్ర శేఖరరెడ్డి, కరావులపల్లి మహేష్, ఎం.ఆర్.పి.ఎస్. నాయకులు నారాయణ, నరసింహులు, ఉపాధ్యాయులు దా. హర్ష వర్ధనరెడ్డి, లక్ష్మీపతి రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.