స్మశానమా! హిందూ సమైక్య వేదికా?

తమిళనాడులో కోయంబత్తూర్ కు దగ్గరలో మెట్టుపాలెం అనే పట్టణం ఉంది.అక్కడ కాశీలో గంగానది వలే భవాని నది పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. ఆ నది ఒడ్డునే స్మశానం ఉంది. స్థానికులకు అది అంత్యేష్టి కార్యక్రమాలకు పవిత్ర క్షేత్రం.
 
20 సంవత్సరాల క్రితం స్వయం సేవకులు చొరవ చూపి 36 కులాల పెద్దల సహకారంతో ఆ స్మశానంను అభివృద్ధి చేశారు. ఆ నదిలో ఒక ప్రాచీన శివ లింగం దొరికింది. దాంతో అక్కడ ఒక శివాలయం ఏర్పడింది. అక్కడే ఒక ధ్యాన మందిరం, గోశాల ఏర్పరిచారు. 
 
ప్రక్కనే ఆధునిక స్మశానం, చెత్తతో ఎరువును తయారు చేసే యంత్రాంగం ఉన్నాయి. నదిలో ఆస్తిక నిమజ్జనంతో పాటు చుట్టూ ప్రక్కల 50 గ్రామాల నుండి అన్ని కులాల ప్రజలు తమ పూర్వీకులకు తిలోదకాలు ఇవ్వడానికి వస్తారు.అన్ని కులాల వారికి అక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి.
 
ఈ కమిటీ వారు ఒక అంబులెన్స్ ను నిర్వహిస్తున్నారు.36 కులాల నాయకులు ఈ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
హిందువులందరికీ ఒకే స్మశానం అనే ప్రయోగం గత 20 సంవత్సరాలుగా ఇక్కడ అమలు అమలవుతోంది.