
ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్ళ వయస్సు నిండేవరకు ఆగనవసరం లేదు. పదిహేడేండ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరు ఓటర్ కార్డు కోసందరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ), కమిషనర్ అనూప్ చంద్రపాండే ప్రకటించారు. అయితే 18 ఏండ్లు నిండిన తర్వాతే ఓటర్ కార్డును జారీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటిదాకా 18 ఏండ్లు నిండినోళ్లు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రతి ఏడాది జనవరి 1దాకా వేచి చూడాల్సి ఉండేదని గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో ముందస్తుగానే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. 17 ఏండ్లు ఉన్నప్పుడే ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఏడాది కలిసి వస్తుందని చెప్పారు.
దీంతో పాటు ఎన్నికల చట్టంలో ఇంకిన్ని కీలక మార్పులు చేసినట్టు తెలిపారు. ఇకమీద జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 లను కూడా పరిగణలోకి తీసుకొని 18 ఏళ్ళ వయస్సు నిండినవారికి ఓటర్ కార్డులను జారీచేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు, ఈఆర్‌వో.. ఏఈఆర్‌వోలకు రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
17 ఏండ్లు నిండినవారు ఎవరైనా ఎలక్షన్ కార్డు కోసం అప్లై చేస్తే అంగీకరించాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన తరువాతే వారికి కార్డు జారీ చేయాలని చెప్పారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే ప్రతీ ఒక్కరు ముందుగా ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, చట్టాల్లో మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రతీ 3 నెలలకోసారి కొత్త ఓటర్ కార్డులతో పాటు కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు ఆగస్టు 1 తర్వాత అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అప్పటి వరకు పాత దరఖాస్తు ఫారాలతో దరఖాస్తు చేసినా అంగీకరిస్తామని తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్