రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్దరణ ప్యాకేజీ

బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌(బీబీఎన్‌ఎల్‌) విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్దరణ ప్యాకేజీకి కేబినెట్‌ అనుమతి తెలిపింది.
సందర్భంగా టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసుల్లో నాణ్యతను పెంచడం, బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్‌ను మరింత చేరువ చేయడం, నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను కొంత ఉపశమనం కల్పించడం. 
 
అంతేకాకుండా, 4జీ సేవలను విస్తరించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని చెబుతూ 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.
4జి సేవలు అందించడానికి, బిఎస్‌ఎన్‌ఎల్‌కు 900 -1800 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌ను పాలనాపరంగా రూ 44,993 కోట్లతో కేటాయించనున్నారు. ఈక్విటీ సమకూర్చడంతో దీనిని కేటాయిస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో విస్తృత నెట్‌ వర్క్‌ను ఉపయోగించుకుని హై స్పీడ్‌ డాటాను అందించగలుగుతుంది. దేశీయంగా సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆత్మనిర్భర్‌ 4జి టెక్నాలజీ స్టాక్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. వచ్చే నాలుగేళ్లకు అవసరమయ్యే పెట్టుబడి వ్యయం అవసరాలకు ప్రభుత్వం రూ.22,471 కోట్లు కాపెక్స్‌ను సమకూరుస్తుంది.
ఇదిలా ఉండగా, ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌) సిద్ధమవుతోంది. ఇందుకోసం తనకు 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌, 3,300-3,670 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 70 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.
 ట్రాయ్‌ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రమ్‌ విలువ రూ.61,000 కోట్లు. ఇందులో 3,300-3670 బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ అత్యాధునిక 4జీ, 5జీ సేవలకు ఉపయోగపడుతుంది. ఇక 700 మెగాహెట్జ్‌ ప్రీమియం బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా తక్కువ టవర్లతో విశాలమైన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించవచ్చు.
 బిఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత పెట్టుబడి ని ఎజిఆర్‌ బకాయిలు, కాపెక్స్‌ , స్పెక్ట్రమ్‌ కేటాయింపునకు బదులుగారూ. 40,000 కోట్ల నుంచి రూ.1, 50,000 కోట్లలకు పెంచుతారు. దీర్ఘకాలిక రుణాన్ని సమకూర్చుకునేందుకు ఈపిఎస్‌యులకు ప్రభుత్వం సావరిన్‌ గ్యారంటీలను సమకూరుస్తుంది. దీనితో ఇవి 40,399 కోట్లను దీర్ఘకాలిక బాండ్లతో సమకూర్చుకోనున్నారు.
లాభనష్టాల ఖాతాను మరింత మెరుగుపరచడానికి, బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి సుమారు రూ.33,404 కోట్ల విలువైన ఎజిఆర్‌ బకాయిలను ఈక్విటీ కిందికి మార్చడంతో సెటిల్‌ చేస్తారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ రూ 7,500 కోట్ల మేర ప్రిఫరెన్స్‌ షేర్లను ప్రభుత్వానికి తిరిగి జారీచేస్తుంది.

రూ. 26,316 కోట్లతో గ్రామాల్లో 4జి మొబైల్‌ సేవలు

ఐదు రాష్ట్రాల్లో 44 వెనుకబడిన జిల్లాల్లో 7,287 గ్రామాలకు 4 జి మొబైల్‌ సేవలను అందించేందుకు రూ.26,316 కోట్లను క్యేబినేట్‌ ఆమోదించింది. మారుమూల ప్రాంతాల్లో బ్రెజిల్‌లో బిఎ-సెయిల్‌-11 ప్రాజెక్టు అభివృద్ధి భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ భారత్‌ పెట్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ అదనపు పెట్టుబడి 1,600 మిలియన్ల యుఎస్‌ డాలర్లు (సుమారు రూ. 12,000 కోట్లు)కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.