ఢిల్లీ, కేరళ విమానాశ్రయంలలో మంకీపాక్స్‌ అలెర్ట్

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని కేంద్రం మంగళవారం ఆదేశించింది.  దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ లక్షణాలున్న విదేశీ ప్రయాణికులను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించనున్నారు.
 తీవ్ర జ్వరం, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలున్న అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించి వారిని ఆసుపత్రికి తరలించాలని విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు. ఢిల్లీ, కేరళ విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్మంకీపాక్స్‌ రోగులకు పరీక్షలు చేసి వారిని ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించడానికి 20మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని విమానాశ్రయంలో నియమించారు.
అనుమానిత మంకీపాక్స్‌ రోగుల నమూనాలను పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపుతారు. అయితే ఢిల్లీ జిల్లా యంత్రాంగం మంకీపాక్స్‌ సోకిన వారి కుటుంబ సభ్యులను నిర్బంధిస్తుంది. మంకీపాక్స్‌ అనుమానిత రోగులను గుర్తించేందుకు పరీక్షలు చేయనున్నారు.
దేశరాజధాని నగరమైన ఢిల్లీలో మంకీపాక్స్‌ వ్యాధి మొదటి కేసును గుర్తించిన  ఒక రోజు తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ అలర్ట్‌ ప్రకటించారు.
కాగా, హైదరాబాద్ లో మంకీపాక్స్‌‌ అనుమానితుని నుంచి ఐదు రకాల శాంపిల్స్ సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్​కు ఫ్లైట్‌‌లో పంపించామని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌‌‌ శంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికల్లా ఫలితాలు వచ్చే అవకాశం​ ఉందని చెప్పారు. 
 
ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. అతనికి మెడ, చేతులు, మొహం, ఛాతి, కాళ్లు, చేతులపై ఎర్రటి దద్దుర్లు ఉన్నాయని, ఇందులో చాలా వరకూ తగ్గిపోయే స్టేజ్‌‌లో ఉన్నట్టు తాము గుర్తించామని చెప్పారు. 

దేశంలో తగ్గిన కరోనా కేసులు
ఇలా ఉండగా, దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 14,830 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2036 కేసులు తగ్గాయి. ప్రస్తుతం 1,47,512 యాక్టివ్ కేసులు ఉండగా..పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 18,159 వైరస్ నుంచి కోలుకోగా..36 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 5,26,110 మంది మరణించగా..4 కోట్ల 32 లక్షల 46వేల 829  మంది కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది.  నిన్న 30లక్షల 42 వేల 47616 లక్షల టీకా  తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 202 కోట్ల 50లక్షల 57వేల 717 కు చేరింది.
సొలిసిటర్‌ జనరల్‌ కు కరోనా 
భారత సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు.