తెలంగాణాతో పాటు బెంగాల్ లో బిజెపిదే అధికారం 

తెలంగాణతో పాటు ప‌శ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ  అంతే కాదు కేర‌ళ‌, ఆంధ్ర ప్రదేశ్ లోనూ పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని భరోసా వ్యక్తం చేసారు.

బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్ర‌త్యేక దృష్టితో చూడ‌ద‌ని చెబుతూ  దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను ఏక‌దృష్టితోనే చూస్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర  తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని… వారసత్వ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారని అమిత్ షా తీర్మానంలో పొందుపరిచారు.

రానున్న 30 నుంచి 40 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ శకమేనని, భారత దేశం విశ్వ గురువుగా ఎదుగుతుందని ఆయన  చెప్పారు. కుటుంబ, వంశపారంపర్య రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు మహా పాపాలని ధ్వజమెత్తారు. బీజేపీ అనుసరిస్తున్న అభివృద్ధి రాజకీయాలు, పనితీరుకు ప్రజామోదం లభిస్తున్నది,  వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో లభిస్తున్న విజయాలే దీనికి నిదర్శనం అని తెలిపారు. కుటుంబ పాలన, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలకాలని అమిత్ షా పిలుపిచ్చారు.

తెలంగాణా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు బీజేపీ తెర దించుతుందని,  అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో కూడా అధికారంలోకి వస్తుందని వివరించారు.  బీజేపీ తదుపరి ఎదుగుదల దక్షిణాది నుంచి కనిపిస్తుందని ఈ సమావేశం సమష్టిగా ఆశాభావం వ్యక్తం చేసిందని, అటువంటి అవకాశాలు ఉన్నట్లు గుర్తించిందని  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాజకీయ తీర్మానం అంశాలను మీడియాకు వివరిస్తూ చెప్పారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని  అమిత్‌ షా భరోసా వ్యక్తం చేస్తూరు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయనడుతూ  నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని గుర్తు చేస్తూ  తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఉన్న చింత ఒక్కటేనని, కేటీఆర్‌ను సీఎం చేయడమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దుతుందని చేస్తూ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని మండిపడ్డారు.

గతంలో వాజపేయి ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్య రాలేదని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారని మండిపడ్డారు. సచివాలయానికి కేసీఆర్ రాక ఎన్ని రోజులైంది? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అంటూ ఎంఐఎం కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడంలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ విధానాలతో అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడుతోందని విమర్శించారు.