రాజస్థాన్ లో నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చాడని టైలర్ హత్య

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను షాపులోనే దారుణంగా హత్య చేశారు. బహిష్కృత బిజెపి నేత  నూపుర్ శర్మకు మద్దతుగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసాడని మంగళవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. నూపుర్‌ శర్మకు మద్దతుగా టైలర్‌ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్టు తెలిసింది.
వార్తా నివేదికల ప్రకారం, మరణించిన బాధితుడు కన్హయ్య లాల్  ఎనిమిదేళ్ల కుమారుడు తన మొబైల్ నుండి నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకున్నాడు. దీని తర్వాత కన్హయ్యాలాల్‌ను ధన్మండి పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. విడుదలైన తర్వాత కూడా ఈ పోస్ట్‌పై హత్య బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

బెదిరింపులకు భయపడిన కన్హయ్య లాల్ రక్షణ కోసం పోలీసులకు విజ్ఞప్తి చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. నవ్ భారత్ టైమ్స్ నివేదించిన ప్రకారం, కన్హయ్యలాల్‌ను అరెస్టు చేసిన తర్వాత కూడా, హంతకులు అతన్ని బెదిరించి చంపేస్తామని బెదిరించారు. దీనిపై కన్హయ్యాలాల్ ధన్మండి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, తనకు భద్రత కల్పించాలని అభ్యర్థించారు. ఇంత జరిగినా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

 
మరోవైపు, ఈ దారుణానికి పాల్పడిన అగంతకులు ఆ హత్యను స్వయంగా వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్‌ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు.

తమను మహ్మద్ రియాజ్ అఖతారీ, మహ్మద్‌లుగా ఇద్దరు ఇద్దరు ఇస్లాంవాదులు చెప్పుకున్నారు.  వారిద్దరిని తర్వాత పొరుగు జిల్లా రాజ్‌సమంద్ లో అరెస్టు చేశారు.

 
టైలర్‌ తన దుకాణంలో పని చేసుకొంటుండగా లోనికి ప్రవేశించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు.  ఉదయ్‌పూర్‌లోని మాల్డాస్ స్ట్రీట్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 
టైలర్‌ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్‌ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు.  ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్‌ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్‌ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్‌ కాకుండా చూస్తున్నారు.
సంయమనం పాటించాలంటూ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్‌ఐఏ బృందాన్ని పంపింది.  అంతేకాకుండా ఐదు కంపెనీల రాజస్థాన్ సాయుధ కాన్‌స్టాబుల్స్తో సహా సుమారు 600 మంది సిబ్బందిని ఉదయపూర్‌కు పంపినట్టు పోలీసు అధికారులు తెలిపారు.  ఇద్దరు నిందితులు మంగళవారం మధ్యాహ్నం ధన్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితుల దుకాణానికి చేరుకున్నారని వారు తెలిపారు.
 
ఈ అంశంపై సీఎంతో మాట్లాడినట్లు అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియా తెలిపారు. “ప్రమేయం ఉన్నవారిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి సహాయం అందించాలి. ఈ సంఘటన ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదు, ఏదో ఒక సంస్థ వల్ల కావచ్చు. ఇది భయంకరమైనది. పరిపాలన వైఫల్యంకు అడ్డం పడుతుంది” అని కటారియా ఆగ్రహం వ్యక్తం చేశారు.