అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీపై వేటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శి ప్రకాష్ చంద్ర ఠాకూర్ ను అవినీతి ఆరోపణలపై  లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర థాకూర్‌ ని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్  అధికారులు హర్షిత్ జైన్, దేవేంద్ర శర్మలపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.
వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా అంతక్రితం సోమవారం కూడా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను కూడా సస్పెన్స్ చేశారు. ఫ్లాట్ల నిర్మాణంలో లోపాలను గుర్తించిన అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
 గత వారం లెఫ్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో శాంతిభద్రతల  పరిస్థితిపై సమీక్ష జరిపారు. క్రైమ్ డేటా విశ్లేషణ, నిరోధక చర్యలు, ప్రధాన సవాళ్లు, సంస్కరణలు లేదా చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి ప్రభావాలపై ఢిల్లీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్ వెల్లడించిన అంశాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను ఆయన మెచ్చుకున్నారు. కేసులపై సమయానుగుణంగా త్వరితగతిన దర్యాప్తు జరపాలని, ఆధారాల సేకరణలో శాస్త్రీయ విధానాలను అవలంభించాని ఆయన సూచించారు