
శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సినీనటి కరాటే కల్యాణి డిమాండ్ చేశారు. సనాతన హిందు సంఘం ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో హిందువులు అంతా ఏకమై న్యాయపోరాటం చేయాలని ఆమె పిలుపిచ్చారు.
కోట్లాది మంది హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నపూర్ శర్మ వ్యవహారంలో అనేక కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, ఇదే తరహా సంఘటనల్లో ఏమాత్రం స్పందించడంలేదని ఆమె ధ్వజమెత్తారు.
సయ్యద్ షరీఫ్ ఉద్దిన్ అనే వ్యక్తి గత కొంత కాలం నుంచి శివలింగంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తెలిపారు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!