పెట్రోలులో 10 శాతం ఇథ‌నాల్‌ను మిళితం లక్ష్యం సాధించాం

ఈ రోజు భార‌త‌దేశం పెట్రోలులో 10 శాతం ఇథ‌నాల్‌ను మిళితం చేయాల‌న్న లక్ష్యాన్ని సాధించిందని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. షెడ్యూల్ కంటే ఐదు నెలల ముందుగానే భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకుందని ఆయన వెల్లడించారు. దేశంలో ఏర్పాటు చేసిన  విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజ-ఇంధన ఆధారిత వనరుల నుండి పొందాలని లక్ష్యంగా  పెట్టుకున్నామని ఆయన చెప్పారు.
ఢిల్లీలోని సేవ్ సాయిల్ మూవ్ మెంట్ కార్య‌క్ర‌మంలో ప్రధాని  ప్ర‌సంగించారు. కాగా ఈ ఉద్యమాన్ని మార్చి 2022లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు. ఆయన 100 రోజుల మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని 27 దేశాల గుండా ప్రారంభించారు. జూన్ 5 నాటికి 100 రోజుల ప్రయాణంలో 75వ రోజుకు చేరుకుందని ప్రధాని కొనియాడారు.
 ‘సేవ్ సాయిల్ మూవ్‌మెంట్’ అనేది నేల ఆరోగ్యం క్షీణించడం గురించి అవగాహన పెంచడానికి ..దానిని మెరుగుపరచడానికి చేతన ప్రతిస్పందనను తీసుకురావడానికి ప్రపంచవ్యాప్త ఉద్యమం. భారతదేశం ఈ లక్ష్యాన్ని నిర్ణీత సమయం కంటే తొమ్మిదేళ్ల ముందే సాధించింది” అని ప్రధాన మంత్రి తెలిపారు.
ఈరోజు దేశ సౌరశక్తి సామర్థ్యం దాదాపు 18 రెట్లు పెరిగిందని చెబుతూ ‘సహజ వ్యవసాయం’ గురించి ప్రస్తావించారు.ఈ ఏడాది బడ్జెట్‌లో గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాలలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి తెలిపారు. “మేము సహజ వ్యవసాయానికి పెద్ద కారిడార్ చేస్తాము, ఇది మన పొలాలను రసాయన రహితంగా చేయడమే కాకుండా నమామి గంగే ప్రచారానికి కొత్త బలాన్ని ఇస్తుంది” అని ఆయన చెప్పారు.
స్వఛ్చభారత్, నమో గంగా లాంటి పథకాలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర అతి తక్కువున్నా.. పర్యావరణ పరిరక్షణకు భారత్ అనేక ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. గతంలో రైతులకు సాయిల్ మేనేజ్మెంట్ పై అవగాహన లేదని, దాన్ని అధిగమించేందుకు సాయిల్ హెల్త్ కార్డులివ్వాలని ప్రచారం చేశామని గుర్తు చేశారు.
భారత్ జీవ వైవిధ్య విధానాలే వన్యప్రాణుల సంఖ్య పెరిగేందుకు కారణమైందని ప్రధాని చెప్పారు. సాయిల్ డీగ్రేడైజేషన్ వల్లే పర్యావరణం పాడవుతుందని తెలిపారు.  ప్రధాని మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్‌మెంట్’ను అభినందిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం కొత్త ప్రతిజ్ఞలు చేస్తున్న తరుణంలో, అలాంటి ఉద్యమాలు కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
గత 8 ఏళ్లలో జరిగిన కీలక కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కోణంలో ఉన్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ లేదా వేస్ట్ టు వెల్త్ సంబంధిత కార్యక్రమం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించడం,  ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న బహుళ-డైమెన్షనల్ ప్రయత్నాలకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.