అప్పుల వివరాలపై ముఖం చాటేస్తున్న తెలుగు రాష్ట్రాలు 

ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో ఇష్టం వచ్చిన్నట్లు వ్యవహరిస్తూ, భారీ ఆదాయాలు వస్తున్నా దొరికిన కాడికి అప్పులు చేస్తూ తమ రాష్ట్రాలను ఆర్ధిక సంక్షోభాలకు నెట్టివేస్తూ, రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాలు వాస్తవ ఆర్ధిక గణాంకాలను వెల్లడించడం లేదని తెలుస్తున్నది.
 
 కనీసం తాము చేస్తున్న అప్పులు, అందుకు ఇచ్చిన హామీల వివరాలు కూడా తెలపడానికి ముఖం చాటేస్తూ,  మరిన్ని అప్పులు చేయడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం లేదంటూ విమర్శలకు దిగుతున్నారు.  ఈ రెండు రాష్ట్రాల తీరుపై ఇప్పటికే అనేక లేఖలు రాసిన కాగ్‌, తాజాగా మరో లేఖ కూడా సంధిరచినట్లు తెలిసింది.
అయితే ఇప్పటివరకు ఆర్థిక శాఖ అధికారులు మాత్రం అరదించాల్సిన లెక్కల వివరాలను ఖరారు చేయలేదని తెలుస్తున్నది. సాధారణంగా ప్రతినెలా ఆర్థికశాఖ అధికారులు తమ రాష్ట్రాల ఆర్థిక లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధిరచి ఫిబ్రవరి నెల వరకు నెలవారీ వివరాలు ఇచ్చినప్పటికీ, మార్చి లెక్కలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు.
 గణాంకాలను సిద్ధం చేయకపోవడమేనని అధికారులు అంటున్నారు. ఎజి కార్యాలయం, రిజర్వ్‌బ్యాంకు, కాగ్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని వారంటున్నారు. ప్రతినెలా ఎజి కార్యాలయం సొంత లెక్కలు సిద్ధం చేసి, వాటిని ఆర్థిక శాఖకు పంపిస్తుంది. ఆ లెక్కలకు, ఆర్థిక శాఖ వద్ద ఉన్న లెక్కలకు భారీగా తేడా ఉరటున్నట్లు తెలుస్తోంది. అరదుకే కాగ్‌ ఖరారుచేసే తుది లెక్కలకు సమాచారం ఇవ్వలేదని భోగట్టా.
2021-22 ఆర్థిక సంవత్సరంలో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తేల్చిన లెక్కల్లో రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయం కన్నా చేసిన వ్యయం భారీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటు ఏకంగా రూ.1,15,949 కోట్లకు చేరుకోవడం విశేషం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,383 కోట్లు లోటుగా తేలితే, ఈ ఏడాది రూ.లక్షా 15 వేల కోట్ల వరకు లోటు ఉన్నట్లు తేలింది.
ఇదే సమయంలో బహిరంగ మార్కెట్‌ రుణాలు, సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల ద్వారా తీసుకున్న రుణాలు కలిపి భారీగా తేలినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గ్యారెంటీల ద్వారా తెచ్చుకున్న రుణాలపై ఆర్థికశాఖ లెక్కలు చెప్పడం లేదని కేంద్రం, రిజర్వ్‌బ్యాంకు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
అందుకే, మార్చి లెక్కలపై ఇంకా ఆర్థికశాఖ తాత్సార ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అరశంపై తాజాగా ఎజి కార్యాలయం నురచి మరోసారి ఆర్థిక శాఖకు లేఖ వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని లెక్కలను ఇప్పటికీ సమర్పించలేదని తెలిసింది.
ప్రధానంగా ఎపిలో ఉన్నట్లుగానే తెలంగాణలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు గ్యారెంటీలు ఇచ్చి భారీగా రుణ సమీకరణ చేసినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అరదుకే ఆ వివరాలను కాగ్‌కు అరదిరచడంలో తెలంగాణ ఆర్థికశాఖ విముఖత చూపించిరది. కాగ్‌ వార్షిక గణాంకాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. తమకు ఆ వివరాలు రాలేదని కాగ్‌ రాతపూర్వకంగానే పేర్కొంది.