కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని ఒక పురాతన మసీదు కింది భాగంలో హిందూ ఆలయానికి సంబంధించిన కళాకృతులు బయటపడ్డాయి. గురుప్ర తాలూకాలోని మలాలీ మార్కెట్‌లోగల జుమా మసీదులో పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ఏప్రిల్ 21న హిందూ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆకృతులు బయటపడ్డాయి.
మసీదును ఇప్పటికే కూల్చివేయగా ఇప్పుడు పునర్నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ఇవి వెలుగు చూడటం సంచలనం సృష్టించింది. మసీదు నిర్మాణం చెప్పకముందే ఇక్కడ ఒక ఆలయం ఉండేదని కొన్ని సంస్థలు వాదిస్తున్నాయి.
కాగా..ఇందుకు సంబంధించిన వాస్తవాలు కనుగొనే వరకు మసీదు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ విశ్వ హిందూ పరిహద్ నాయకులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఇటీవల శివలింగం లభించడంతో వివాదం రాజుకున్న నేపథ్యంలో తాజాగా మంగళూరులో ఈ సంఘటన వెలుగు చూడడం గమనార్హం.

More Stories
అయోధ్యలో ప్రత్యేక 10 రోజుల ప్రాయశ్చిత్త, శుద్ధి పూజలు
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి