పరస్పర విశ్వాసమే క్వాడ్ బలం

US President Joe Biden, Japanese Prime Minister Fumio Kishida, Indian Prime Minister Narendra Modi and Australian Prime Minister Anthony Albanese arrive for their meeting during the Quad Leaders Summit at Kantei in Tokyo on May 24, 2022. (Photo by SAUL LOEB / AFP)

అతి తక్కువ సమయం లో ప్రపంచం ముందు క్వాడ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందని  ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ రాజధాని టోక్యో వేదికగా . క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ .నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ప్రజాస్వామిక విలువల పాలనే దీనికి ప్రధాన బలమని పేర్కొన్నారు. క్వాడ్ దేశాల మధ్య విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. 

 ఇండో- పసిఫిక్ లో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తుందన్న ప్రధాని కరోనా కష్ట కాలంలో సభ్య దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందిందని తెలిపారు. ప్రధానిగా ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధానిని ప్రత్యేకంగా మోడీ అభినందించారు.

సదస్సుకు ముందు బైడెన్, కిషిదా, అల్బనీస్ తో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధాని మోదీ  చర్చించారు. మంగళవారం ఉదయమే వేదికపైకి చేరుకున్న నాలుగు దేశాల అధినేతలు పరస్పరం షేక్ హ్యాడ్, పలకరింపులు, ఫొటోషూట్ తో సందడి చేశారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ మాదిరిగా కూర్చొని నలుగు నేతలూ సంక్షిప్తంగా  ప్రారంభ ఉపన్యాసాలు చేశారు.

ఇండో పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ కూటమే శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. క్వాడ్ కేవలం తూతూమంత్రపు వ్యవహారం కాదని, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా సమ్మిళిత అభివృద్ధి, భాగస్వామ్యుల శ్రేయస్సు కోసమే ఏర్పడిందని క్వాడ్ సదస్సు ప్రారంభం ఉపన్యాసంలో ఆయన చెప్పారు.

భారత్ – అమెరికా బంధం దృడమైనది 
 
భారత్ – అమెరికా మధ్య బంధం చాలా దృఢమైనదని, ఈ బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీకని ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యోలో అమెరికా అధినేత జో బిడెన్ తో  ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య, వ్యాపారపరమైన అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించారు. 
 
ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఆలోచనలు, విలువలు ఒకే విధంగా ఉంటాయని, ఇదే ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేశాయని అన్నారు.
 
‘‘ఇరు దేశాలకు ఎన్నో అంశాల్లో పోలికలు, సామీప్యతలు ఉన్నాయి. అదే ఇరు దేశాల మధ్య బలమైన వారధిని నిర్మించింది. వ్యాపార, పెట్టుబడులకు కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మరింత మెరుగ్గానే ఉన్నప్పటికీ అది ఆశించిన స్థాయికి చేరుకోలేదు. యూఎస్​ ఇన్వెస్ట్మెంట్​ ఇన్సెంటివ్​ అగ్రిమెంట్​తో ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా కూడా బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. కాగా.. భారత్, అమెరికా కలిసి చాలా సాధించాగలవని బైటెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.