కశ్మీర్‌ యూనివర్సిటీ తొలి మహిళా వీసీగా నీలోఫర్ ఖాన్

యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్‌ తొలి మహిళా వైస్‌ ఛాన్సలర్‌గా 30 ఏళ్ల టీచింగ్‌ అనుభవం ఉన్న ప్రొఫెసర్‌ నీలోఫర్‌ ఖాన్‌ నియమితులయ్యారు. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. 

ప్రస్తుతం హోం సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఖాన్  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆగస్టు 2018లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా రెండవ పదవీకాలాన్ని పూర్తి చేసిన ప్రొఫెసర్ తలత్ పూర్తి చేశారు. ఈయన స్థానంలో ఇప్పుడు నీలోఫర్ ఖాన్ కు అవకాశం వీసీగా ఛాన్స్ దక్కింది. 

దీంతో విశ్వ విద్యాలయం చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపకులపతిగా ఖాన్ నియమితులు కావడం చెప్పుకోదగిన విషయం. అంతే కాకుండా ఈమె స్టూడెంట్ వెల్ఫేర్‌ డీన్ గా కూడా పని చేసి, ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ప్రొఫెసర్ గా రికార్డు సృష్టించారు.

ఇకపోతే ఈ యూనివర్సిటీని 1948లో స్థాపించారు. ఆ తర్వాత శ్రీనగర్ కేంద్రంగా కశ్మీర్ యూనివర్సిటీ, జమ్ము కేంద్రంగా జమ్మూ యూనివర్సిటీగా విభజించారు. ఇది చాల్ సరస్సు ఒడ్డున 247 ఎకరాలలో విస్తరించి ఉంది.