ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్‌లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్ ప్రస్తుతం కోర్ట్ ముందుండగా, తాజాగా తాజ్ మహల్ ఉన్న ప్రాంతం తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దివ్య కుమారి స్పష్టం చేశారు.
ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్‌కు సంబంధించిందని ఆమె స్పష్టం చేశారు. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయని ఆమె చెప్పారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. అందుకు ఏమైనా పరిహారం ఇచ్చారా? అందుకు ఒప్పుకున్నారా? అనే విషయం తనకు తెలియదని ఆమె చెప్పారు.
ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని ఆమె గుర్తు చేశారు. ఒకవేళ తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు.
‘‘తాజ్ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది” అని ఆమె తెలిపారు.
జైపూర్ కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వీటిని అందజేస్తామని గతంలో జైపూర్ రాజకుటుంబానికి చెందిన కుమారి తెలిపారు. అయితే తమ పూర్వీకులకు (జైపూర్ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని ఆమె చెప్పారు. వారిని పరిశీలించిన తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
అయోధ్యలోని రామ మందిరం సమయంలో రాముడి వారసుల సమస్య వచ్చినప్పుడు కూడా జైపూర్ రాజకుటుంబం వారు రాముడి వారసులమని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే తాజ్ మహల్ ను పగలగొట్టి దర్యాప్తు చేయమని తాము కోరడం లేదని ఆమె స్పష్టం చేశారు.
కానీ, తాజ్ మహల్ లో అనేక భాగాలు, గదులు మూసివేసి, సీలు చేశారు. ఏమి జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే అసలు విషయం బయటకు వస్తుందని ఆమె వివరించారు. . ఈ కేసులో టూర్తస్ కోర్టుకు వెళ్లబోనని, అయితే వీటన్నింటిపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ వివాదంపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బ్రిటిష్ కాలం నుంచి మూతపడిన ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు, పురాతన శివలింగాలు, శాసనాలు ఉండవచ్చని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, 1212 సంవత్సరంలో, ఆగ్రాలో రాజు పర్మార్దిదేవ్ శివుని ఆలయాన్ని నిర్మించాడని చెబుతున్నారు.
ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న చోట, దానిని తేజో మహాలయ లేదా తేజో మహల్ అని పిలుస్తారని, అయితే షా జహాన్ తేజో మహాలయాన్ని పగలు కొట్టింది. దానిని సమాధిగా చేసాడని ఆరోపించారు. మే 12న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఈ కేసు విచారణకు రానుంది.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!