పార్టీ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నేత అత్యాచారం!

నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అదే పార్టీకి చెందిన 45-సంవత్సరాల వయస్సు గల  రాష్ట్ర మహిళా నాయకురాలు ఒకరు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తనను ఓ హోటల్‌కు పిలిపించి, మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి, మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 
 
సెల్‌పోన్‌లో తన నగ్న చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి.. బ్లాక్‌మెయిల్‌ చేశాడని వాపోయారు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలికి 2020 మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాను కేటాయించారు. 
 
ఆ సమయంలో ఆ నాయకురాలికి నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ‘‘నా భార్య ఆరోగ్యం బాగుండదు. మూడేళ్లకు మించి బతకదు. నాకో తోడు కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా’’ అని ఆమెను నమ్మించాడు. 
 
‘‘దుబ్బాక ఎన్నికల సమయంలో ఓ రోజు రాత్రి శివకుమార్‌రెడ్డి తప్పతాగి బాధితురాలు ఉంటున్న గదికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టాడు. పెళ్లికానిదే, అవేమీ ఉండవని సున్నితంగా తిరస్కరించా. జుట్టుపట్టుకుని, తీవ్రంగా దాడి చేశాడు. నేను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు”.
” 2021 జూన్‌ 24న శివకుమార్‌ రెడ్డి నన్ను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా బలవంతం చేయబోగా.. ఒప్పుకోలేదు. దీంతో అత ను ఓ పసుపు తాడు మెడలో కట్టి, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిపోయిందన్నాడు. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ సారి బెంగళూరులో పని ఉందంటూ తీసుకెళ్లి, అక్కడా అత్యాచారం చేశాడు”.
“ఇటీవల బేగంపేటలోని ఓ హోటల్‌కు పిలిపించాడు. లైంగిక దాడికి యత్నించగా.. అడ్డుకున్నాను. దాంతో.. అతడు మాటల్లో పెట్టి.. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించాడు. నేను స్పృహ కోల్పోగానే.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తన సెల్‌పోన్‌లో నగ్న చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత.. తన వద్ద నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నాయని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తన అనుచరులతో ఆమెను అవమానించేలా కుట్రలు పన్నాడు’’
 బాధితురాలు ఈ నెల 7న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ వివరాలను పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు శివకుమార్‌ రెడ్డిపై ఐపీసీలోని 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.