పూర్వ ప్రాంత సంఘచాలక్ ప్యాట మృతి 

అక్షయ తృతీయ పుణ్యదినాన,  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత పూర్వ సంఘచాలక్ లు, ఎందరో స్వయంసేవక్ లకు స్ఫూర్తి ప్రదాత,  నిరంతర చైతన్య స్ఫూర్తి వెంకటేశ్వర రావు గారు స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. 
,
నారోగ్యం తో   గత కొద్ధి  రోజులుగా కేర్ హాస్పిటల్ నందు   చికిత్స పొందుతూ  మంగళవారం  సాయంత్రం మృతి చెందారు.  ప్యాటజీ భాగ్యనగర్ స్వయంసేవక్ ,  గడిచిన 50 సంవత్సరాలకు పైగా ఆర్ ఎస్ ఎస్ లో  గట నాయక్ స్థానం నుండి ప్రాంత సంఘచాలక్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.
ఆయన స్వయంగా గాయకులు. పూజ్య గురూజీ నుండి అందరూ సర్ సంఘచాలక్ లను అతి దగ్గర నుండి చూసారు. మానవతా మూర్తి, నిరంతర చైతన్య శీలి. అనేక కార్యకర్త లకు స్ఫూర్తి ప్రదాత. వారి మరణం తెలంగాణలోని స్వయం సేవకులకు తీరని లోటు అని తెలంగాణ  ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి నివాళులు అర్పించారు.
సివిల్ సూపరిండెంట్ ఇంజినీర్  గా  రహదారులు, భవనాల శాఖలో  పని చేసి ఆయన పదవి విరమణ చేశారు.  ప్యాటజీ భౌతిక కాయం అంతిమ దర్శనార్థం సీతాఫల్మండి, సికింద్రాబాద్ లోని ఆయన స్వగృహం వద్ద ఉంచారు.  అంతిమ యాత్ర గురువారం మధ్యాహ్నం 1 గంటకు మొదలై,  అంత్యక్రియలు బన్సీలాల్ పేటలో నిర్వహిస్తారని కుటుంభం సభ్యులు తెలిపారు.

ప్యాట  వెంకటేశ్వర్ రావు మృతి పట్ల దక్షిణామూర్తి  ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, వారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించవల్సిందిగా ఆ పరమేశ్వరుని ప్రార్ధించారు.