ఆజాది అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సందర్శించారు. అల్లూరి జన్మస్థలం పాండ్రంగి చేరుకున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనంతరం అల్లూరు కుటుంబ సభ్యులను సత్కరించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల దంపతుల విగ్రహాలను బర్లపేటలో ఆయన ఆవిష్కరించారు. అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమే భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర అని వెంకయ్య నాయుడు చెప్పారు. కాబట్టి స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. వివక్షలకు తావులేని నవ భారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు

More Stories
ఎస్ఐఆర్ లో నిజమైన ఓటరుకు అన్యాయం జరగదు
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే