కేంద్రం నిధులిస్తున్నా స్వచ్ఛ  భారత్ అమలుచేయని ఏపీ 

కేంద్రం నిధులిస్తున్నా స్వచ్ఛ  భారత్ అమలుచేయని ఏపీ 
స్వచ్ఛభారత్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం  సవ్యంగా ఖర్చు చేయడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు విమర్శించారు. 
 
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో  విజయవాడ క్రుష్ణా నది వడ్డున స్వచ్చ భారత్ నిర్వహించారు. విజయవాడ జిల్లా  బిజెపి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొని కృష్ణా నదీ తీరంలో సుమారు గంటకు పైగా పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించారు. బిజెపి నాయకులంతా చీపుళ్ళు  చేత పట్టి చెత్తను తొలగించారు. బిజెపి నేతలకు స్ధానికులు కూడా సహకరించారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ నగర పంచాయితీల నుండి  మున్సిపల్ కార్పోరేషన్  ల వరకు  అందంగా తీర్చిదిద్ది సౌకర్యవంతంగా మార్చడానికి స్వచ్చ భారత్  కార్యక్రమాన్ని వినియోగించు కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పధకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.
 అయితే, ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా సవ్యంగా స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు.  ఈ కార్యక్రమం కోసం సంవత్సరానికి  రాష్ట్రానికి వెయ్యి కోట్లు  కేంద్రం నిధులు విడుదల చేస్తోందని ఆయన చెప్పారు. 
పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో కూడా వైసిపి  ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రో 32 వేల కోట్లు నిధులు మంజూరు చేస్తే  నిర్మాణం లో ఉన్న ఇంటికి పన్ను వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మౌలిక వసతులు కల్పించకుండా అంటే విద్యుత్, డ్రైయినేజ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా ఎలా పన్నులు వసూలు చేస్తారని  ఆయన ప్రశ్నించారు.  డొల్ల ప్రభుత్వాన్ని  బిజెపి లెక్క చేయదని స్పష్టం చేశారు.  ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని నిలదీస్తామని వీర్రాజు హెచ్చరించారు.
ఈ డొల్ల ప్రభుత్వం  అబద్దాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులు ఏంచేశారని తీవ్ర స్వరం తో వీర్రాజు ప్రశ్నించారు.  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు,  విజయవాడ జిల్లా
అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం,  ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వర రాజు, స్వచ్చభారత్  జిల్లా కన్వీనర్  ఎర్ర రవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.