ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో పర్యటించేందుకు వెళ్తున్న బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య, పలువురు బీజేపీ నేతలను పోలీసులు బుధవారంనాడు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా, ఇతర మద్దతుదారులను దౌసా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందు, కరౌలీలో ప్రజలను కలుసుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నట్టు ఒక ట్వీట్‌లో తేజస్వి పేర్కొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తౌమ్ కరౌలీ వెళ్తామని, శాంతియుతంగా వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని, పోలీసులు అడ్డుకుంటే సామూహికంగా అరెస్టవుతాయమని పార్టీ మద్దతుదారులతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు.
ప్రదర్శకులు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోని తీసుకున్నారు.

More Stories
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో డీన్ గా ప్రొఫెసర్ తొలగింపు
హమీద్ అన్సారీ `హిందూ మితవాద మతతత్వం’ వాఖ్యల దుమారం
ప్రధాని మోదీని ఎగతాళి చేస్తూ రాహుల్ ప్రదర్శన.. మండిపడ్డ బిజెపి