
ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
పార్లమెంటరీ అధికార భాషా కమిటీ అధ్యక్షుడిగా ఉన్న షా, కేంద్ర మంత్రివర్గం 70 శాతం ఎజెండా ఇప్పుడు హిందీలో తయారు చేస్తున్నట్లు సభ్యులకు తెలియజేశారు. దేశ ఐక్యతలో అధికార భాషను ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.
ఇతర భాషలను మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారత భాషలోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక భాషలకు కాకుండా ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని షా సూచించారు. ఇతర స్థానిక భాషల్లోని పదాలను స్వీకరించి హిందీని అనువైనదిగా మార్చితే తప్ప, ప్రచారం జరగదని ఆయన పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో 22,000 మంది హిందీ ఉపాధ్యాయులను నియమించినట్లు అమిత్ షా తెలిపారు. అలాగే, ఈశాన్య ప్రాంతంలోని తొమ్మిది గిరిజన సంఘాలు తమ మాండలికాల లిపిలను దేవనాగరిలోకి మార్చుకున్నాయని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాలలోని ఎనిమిది రాష్ట్రాలు పదవ తరగతి వరకు పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడానికి అంగీకరించాయని తెలిపారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి షా అధ్యక్షత వహించారు. కమిటీ ఉపాధ్యక్షుడు భృతహరి మహతాబ్ కూడా పాల్గొన్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు