
ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమ ల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అతడు పాకిస్థాన్‌లో లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలను సందర్శిస్తున్నాడని, భారత్, ఇజ్రాయెల్, అమెరికా తదితర పాశ్చాత్యా దేశాలపై యుద్ధం చేయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని వెల్లడించింది.
ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో లష్కరే తాయిబా ఉగ్రవాదిని భద్ర తా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌లో ముష్కరులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో గాలింపు చేపట్టిన బలగాలపై కాల్పులు ప్రారంభించారు. బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యా డు. అతణ్ని లష్కరే ఉగ్రవాదిగా గుర్తించామని అధికారులు తెలిపారు.
మరోవంక, జమ్మూలోని సిధ్రాలో ఓ ఆలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిం ది. శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారికి ధ్వంసమైన విగ్రహా లు కనిపించాయి. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం