బీర్భూమ్‌ హింసాకాండకు టీఎమ్‌సీ మాఫియానే కారణం

బెంగాల్‌లోని బీర్భూమ్‌లో ఇటీవల జరిగిన హింసాకాండకు అధికార టీఎమ్‌సీ నడిపిస్తున్న మాఫియానే కారణమని బీజేపీ నిజనిర్ధరణ కమిటీ అభిప్రాయపడింది. బీర్భూమ్‌లో జరిగిన ఘటన వెనుక నిజాలు తేల్చేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటైంది. 
 
తాజాగా ఈ కమిటీ తన నివేదికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి.నద్దాకు బుధవారం అందజేసింది. పోలీసులు, రాజకీయ నాయకుల ఆద్వర్యంలోని మాఫియానే పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వం సహకారం అందిస్తున్న మాఫియానే హింసకు కారణమని తేల్చింది. 
 
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదని, ప్రజలు ఎప్పుడో అక్కడి ప్రభుత్వం, చట్టాల మీద విశ్వాసం కోల్పోయారని కమిటీ చెప్పింది.  బీర్భూమ్‌లో జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నిజాలు తెలుసుకునేందుకు బీజేపీ కమిటీ బీర్భూమ్ వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
స్థానిక పోలీసులు, అధికారుల నుంచి కూడా సహకారం అందలేదు. మరోవైపు అధికార టీఎమ్‌సీ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందుల మధ్యే నిజనిర్ధరణ కమిటీ తన నివేదిక సమర్పించింది.
“పశ్చిమ బెంగాల్ పోలీస్‌లోని ఒక్క అధికారి/కానిస్టేబుల్ కూడా అక్కడ  కనిపించలేదు. నిర్జనిర్ధారణ బృందంపై దాడి జరిగినప్పుడు ఎవరూ రక్షించలేదు.  కమిటీ నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించడానికి మార్గాన్ని క్లియర్ చేసింది. డిజిపి, ఇతర అధికారులను సంప్రదించడానికి మేము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి” అని ఆ నివేదిక వెల్లడించింది.

బీర్భూమ్ హింసాకాండ తరువాత, నడ్డా నలుగురు మాజీ ఐపీఎస్  అధికారులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ డిజిపి బ్రీజ్ లాల్, లోక్ సభ సభ్యుడు,  ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్, రాజ్యసభ సభ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.సి. రామమూర్తి; లోక్ సభ సభ్యుడు సుకాంతో మజుందార్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్.

“ఘటన జరిగిన బీర్భూమ్‌లోని గ్రామానికి నిజనిర్ధారణ కమిటీ వెళ్లింది. అధికార తృణమూల్ కాంగ్రెస్  కారణంగా మేము గ్రామానికి చేరుకోవడానికి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది” అని కమిటీ సభ్యుడు సుకాంతో మజుందార్ నివేదిక సమర్పించడానికి ముందు ఒక వార్తాసంస్థకు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హట్ ప్రాంతంలో మంగళవారం నాడు ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు,  ఆ తర్వాత మరొక మహిళా కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందింది.  మార్చి 21న టిఎంసి  నాయకుడు బదు షేక్‌ను హత్య చేసిన తర్వాత ఒక గుంపు ఇళ్లకు నిప్పుపెట్టింది. .

కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఈ ఊచకోతపై విచారణ జరుపుతోంది. ఈ హత్యలపై దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. అయితే దానిని కోర్టు కేసును ఎత్తివేసింది.