ఎపిలో విద్యుత్ చార్జీలు భారీగా పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. కరెంట్ చార్జీల టారీఫ్ ని విద్యుత్‌ రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్‌ నాగార్జున రెడ్డి బుధవారం విడుదల చేశారు. 
 
30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.3.10 పైసలు ఉంటే రూ. 4.50 పైసలు, 126-225 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.4.45 పైసలు ఉంటే రూ.6 లకు పెరిగాయి
అదేవిధంగా,  226-400 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.7.50 పైసలు ఉంటే రూ.8.75 పైసలు, 400 యూనిట్లు దాటితే యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.9.20 పైసలు ఉంటే రూ.9.75 పైసలు పెంచినట్లు తిరుపతి సెనేట్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎపిఇఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి వివరాలను వెల్లడించారు.
పెట్రోల్, గ్యాస్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. ఈ మేరకు గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.