“మా సూత్రాలపై మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అంతర్జాతీయ క్రమం తప్పనిసరిగా ప్రాదేశిక సమగ్రతను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే మా నమ్మకంతో మా విధానం చాలా మార్గనిర్దేశం చేయబడింది…” అని జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యసభలో తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్‌లతో సంబంధం ఉన్న పరిస్థితి “మా సమస్య కాదన్నది భారతదేశం వైఖరి కాదు. మేము శాంతి కోసం ఉన్నాము అనేది మా విధానం” అని ఆయన తేల్చి చెప్పారు. ” ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకురాగలిగింది” అని గుర్తు చేశారు.
కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా అందించిన వ్రాతపూర్వక ప్రకటనలో, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం విధానం “దృఢంగా, స్థిరంగా” ఉందని స్పష్టం చేశారు. భారతదేశం “దిగజారిపోతున్న పరిస్థితి” పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తక్షణమే నిలిపివేయాలని. అన్ని శత్రుత్వాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిందని కూడా గుర్తు చేశారు. .
రష్యా దండయాత్ర, భారత్-అమెరికా వాణిజ్యంపై దాని సంభావ్య ప్రభావాలకు వ్యతిరేకంగా క్వాడ్ దేశాలలో భారతదేశం విధానం “కొంతవరకు అస్థిరంగా ఉంది” అని అమెరికా పేర్కొన్నదని మణి అడిగిన అనుబంధ ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ: “ఉక్రెయిన్ పరిస్థితిని వాణిజ్య సమస్యలతో ముడిపెట్టే ప్రశ్నే లేదు” అని చెప్పారు.
“ఉక్రెయిన్‌పై మన స్వంత విధానంపై సంబంధించినది. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది ఆరు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది: ఒకటి, హింసకు, అన్ని శత్రుత్వాలకు తక్షణమే స్వస్తి పలకాలని మనం పిలుపిచ్చాము. మనం శాంతి కోసం నిలబడతాము. రెండు, చర్చలు, దౌత్య మార్గానికి తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదని మనం నమ్ముతున్నాము.
అమెరికా, భారతదేశమీ కాకుండా, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్ గ్రూపింగ్‌లో భాగంగా ఉన్నాయి. శత్రుత్వం చెలరేగినప్పటి నుండి, ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మూడుసార్లు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో రెండుసార్లు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు.
“అధ్యక్షుడు పుతిన్ ఉక్రేనియన్ , రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై ప్రధానికి వివరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలను ప్రధాని స్వాగతించారు మరియు. అవి వివాదానికి విరమణకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు పుతిన్ , అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష సంభాషణ కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలకు గొప్పగా సహాయపడుతుందని ఆయన సూచించారు, ” అని జైశంకర్ వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు.
“రష్యా, చైనా మధ్య, చాలా ఇతర దేశాల మధ్య” అంతర్జాతీయ క్రమంలో జరుగుతున్న “అన్ని మార్పుల” గురించి భారతదేశానికి పూర్తిగా తెలుసునని, భారతదేశం దీనిని పరిష్కరించగల స్థితిలో ఉందా అనే అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన చెప్పారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, భారతదేశపు ముడి చమురు దిగుమతుల్లో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుండి (ఇరాక్ 23%, సౌదీ అరేబియా 18%, UAE 11%). అమెరికా ఇప్పుడు భారతదేశానికి (7.3%) ముఖ్యమైన ముడి చమురు వనరుగా మారింది.
More Stories
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం