
ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని, మానవ సంక్షోభం అంచుల్లోకి వెళ్తున్నదని, తాము మాత్రం ఉక్రెయిన్‌కు సాయం అందిస్తూనే ఉంటామని ఐక్యరాజ్య సమితిలో భారత్ స్పష్టం చేసింది.
భద్రతా మండలిలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో పరిస్థితులు చేయి దాటిపోకుండా ప్రపంచ దేశాలు వెంటనే సిద్ధం కావాలని కోరారు. బాధిత జనాభాకు మానవతా సాయం చేయడమన్నది తక్షణ అవసరని పేర్కొన్నారు.
మానవత్వం, నిష్పక్షపాతం, తటస్థ వైఖరి, స్వాతంత్య్ర సూత్రాల ద్వారా మానవత్వ సాయాన్ని మార్గనిర్దేశం చేయడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లో బాంబులు, క్షిపణుల దాడికి బలైన ముప్పు ఎదుర్కొంటున్న కుటుంబాల కోసం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ చర్యలను రాజకీయ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు చనిపోతున్నారని, శరణార్థులు, నిరాశ్రయులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాంబులు పడుతున్న ప్రాంతాల్లో మానవ జీవన స్థితిగతులు క్షీణించిపోతున్నాయని ఆయన వివరించారు.
వేలాది మంది ప్రజలు అంతర్గతంగా తరలి వెళ్లారు. మూడు మిలియన్ల కంటే ఎక్కువ మంది శరణార్దులు పొరుగు దేశాలకు తరలిపోవడం. ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో మానవతావాద పరిస్థితులు మరింత దిగజారాయని తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుండి సుమారు 22,500 మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా భారత్ తీసుకురానుందని ఆయన తెలిపారు. ఆ ప్రక్రియలో భాగంగా 18 ఇతర దేశాల పౌరుల తరలింపులో కూడా భారత్ సాయం చేస్తున్నట్లు వెల్లడించాయిరు. వారిని సురక్షితంగా తరలించేందుకు ఉక్రెయిన్, పొరుగు దేశాలు అందించిన సౌకర్యాలు అభినందనీయమని చెప్పారు.
More Stories
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి