రష్యాపైఆంక్షలతో అమెరికాలో భగ్గుమన్న పెట్రోల్ ధరలు 

రష్యాపైఆంక్షలతో అమెరికాలో భగ్గుమన్న పెట్రోల్ ధరలు 

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ ఫలితంగా అమెరికాలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. రెండు దేశాల మధ్య జరుగున్న యుద్ధం.. అమెరికన్లకు సెగ తగులుతోంది. రష్యాను లక్ష్యంగా చేస్తూ మాస్కో నుంచి ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే అమెరికాలో పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పైపైకి ఎగబాకాయి. అయితే ఈ పరిణామం ముందే ఊహించిందని  ధరల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటామని బైడెన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తోపాటు యూరోపియన్‌ మిత్రదేశాలకు అమెరికా ఆర్థిక సాయం చేయనుంది. సుమారు రూ.1,04,147 కోట్ల (13.6 బిలియన్‌ డాలర్ల) అమెరికా ఆర్థిక చేయూతనివ్వనుంది. 

ఈమేరకు చట్టసభ్యుల మధ్య అంగీకారం కుదిరింది. దౌర్జన్యం, అణచివేత, హింసాత్మక దాడికి వ్యతిరేకంగా ఆ దేశాలకు మద్దతు ఇస్తామని బైడెన్‌ పేర్కొన్నారు. ఆ దిశగా ఆర్థిక సాయమందించేందుకు సైనిక, మానవతా, ఆర్థిక చేయూత నిమిత్తం 10 బిలిన్‌ డాలర్లు అవసరమని బైడెన్‌ పేర్కొన్నారు. 

డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ సభ్యులంతా ఇందుకు సంబంధించిన బిల్లుకు మద్దతు తెలిపి ఈ మొత్తాన్ని 13.3 బిలియన్లకు సవరించారు. ఇందులో సుమారు రూ.30,645 కోట్లు (4 బిలియన్‌ డాలర్లు) ఉక్రెయిన్‌కు, శరణార్థుల నిర్వహణ నిమిత్తం తూర్పు ఐరోపా దేశాలకు రూ.15,322 కోట్లు (2 బిలియన్‌ డాలర్లు) ఇవ్వనున్నారు. 

అలాగే మిగిలిన ఆర్థిక సంవత్సరంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సుమారుగా మరో రూ. 115 లక్షల కోట్ల (1.5 ట్రిలియన్‌ డాలర్ల)ను ఫెడరల్‌ ఏజెన్సీలకు సమకూర్చాలని కూడా నిర్ణయించారు.