పాక్ యువతిని కాపాడిన భారత్… మోదీకి కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతుండగా.. అక్కడ చిక్కుకున్న తమ దేశ పౌరులను తరలించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా భారత అధికారులు పాక్‌ విద్యార్థిని సైతం రక్షించారు.  పాక్‌కు చెందిన అస్మా షఫిక్‌ అనే విద్యార్థినిని కాపాడగా, తమ దేశానికి వెళ్లేందుకు తరలింపు ప్రక్రియ జరుగుతున్న పశ్చిమ ఉక్రెయిన్‌కు చేరుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
త్వరలో ఆమె తన కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. తనకు సాయం చేయడం పట్ల హొకీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతతలు తెలిపారు. ‘చాలా క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా మద్దతునిచ్చినందుకు హొకీవ్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి, ప్రధాని మోదీకికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అని ఆమె పేర్కొన్నారు. 
 
కాగా, .ఫిబ్రవరి 24 న రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాల ద్వారా ఆపరేషన్ గంగా కింద భారతీయ పౌరులను తరలిస్తోంది.రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 16వేల మందికి పైగా పౌరులు భారతదేశానికి తిరిగి వచ్చారు.
విదేశీయులను భారత్‌ రక్షించడం ఇది తొలిసారి కాదు.. గతంలో బంగ్లాదేశ్‌ జాతీయుడ్ని కూడా రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరో నేపాల్‌కు చెందిన హొపౌరుడు హొసైతం ఆపరేషన్‌ గంగాకు చెందిన విమానంలో రానున్నట్లు పేర్కొంది. హొహొ