సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ఉక్రెయిన్‌-పోలాండ్ సరిహద్దుకు 8 కిమీ. దూరంలో కాలేజ్ బస్సు డ్రాప్ చేశాక మంది విద్యార్థులు కాలినడకన సరిహద్దుకు చేరు కున్నారని ఎఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. పోలాండ్‌కు 70 కిమీ. దూరంలో ఎల్వివ్‌లోని వైద్య కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉక్రె యిన్‌ను వదిలి పొరుగు దేశంలోకి వెళ్లిపోవాలను కున్నారు. 

కానీ రష్యా దాడితో ఉక్రెయిన్ గగన తలం కూడా మూతపడిపోయింది. పోలాండ్ ఉక్రెయిన్ సరిహద్దుకు నడుచుకుంటూ చేరిన వీడియోను కూడా భారతీయ విద్యార్థులు షేర్ చేశారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడిచేయడంతో వారంతా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎల్వివ్, చెర్నివ్‌ట్సీలో క్యాంప్ ఆఫీసుల తెరిచింది. పోలాండ్‌కు తరలిపోతున్న భారతీయ విద్యార్థుల కు సాయపడేందుకు రష్యన్ భాష మాట్లాడే అధి కారులను ఈ క్యాంప్ ఆఫీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపింది. 

మరోవైపు ఉక్రెయిన్‌లో దా దాపు 2500 మంది గుజరాత్ విద్యార్థులు చిక్కుకుపోయారు గుజరాత్ విద్యా శాఖ మంత్రి జి తు వఘానీ తెలిపారు. ఇక తమ వద్ద ఆహారం, నీళ్లు కొంచమే ఉన్నాయని, నెట్‌వర్క్ కవరేజ్ కూ డా ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చని, కేరళకు చెందిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 

“ముఖ్య మైన వస్తువులు తీసుకుని యూనివర్శిటీ హాస్టల్ బంకర్లకు వెళ్లమని మమ్మల్ని అధికారులు  చెప్పారు” అంటూ ఓ  విద్యార్థిని చేసిన వీడియో కాల్‌లో 60 మంది విద్యార్థులు తమ ముఖ్య వస్తువులతో నేలపై కిక్కిరిసి కూర్చుని ఉండడం కనిపించింది. వారున్న చోట డిమ్ లైట్ వెలుతురే ఉంది.

రోమానియా ప్రభుత్వ సహాయం 

యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశం నుంచి తరలివస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా ప్రభుత్వం సహాయం అందించింది.ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారత విద్యార్థులకు, శరణార్థులకు రొమేనియా ప్రభుత్వం ఆహారం, వసతి కల్పిస్తుందని ఢిల్లీలోని రొమేనియా దేశ రాయబారి డానియెలా సెజోనోవ్ చెప్పారు. భారత రాయబార అధికారులు విద్యార్థులను సరిహద్దులోని బుకారెస్ట్ కు చేరుకోవడానికి సహాయం అందిస్తున్నారు.

బుకారెస్ట్ నుంచి విద్యార్థులను తరలించడానికి భారతదేశానికి విమానాలు నడుపుతున్నారు.ఉక్రెయిన్ దేశం నుంచి వస్తున్న శరణార్థులకు సహాయపడేందుకు రొమేనియా ప్రభుత్వం సంక్షోభ సెల్ ను ఏర్పాటు చేసింది. తొలి బ్యాచ్‌ భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి సుసీవా సరిహద్దు మీదుగా రొమేనియా చేరుకున్నారు.

సుసేవాలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బృందాలు ఉక్రెయిన్ విద్యార్థులను భారతదేశానికి తరలించేందుకు బుకారెస్ట్‌కు విమానాలు ఏర్పాటు చేశారు.ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రొమేనియన్ తో పాటు యూరోపియన్ దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడారు.

కీవ్ రాయబార కార్యాలయం కీలక సూచనలు 

ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకి కీవ్‌లోని రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించారు. వివిధ సరిహద్దు చెక్‌పాయింట్‌ల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారత పౌరులను తరలించడం కోసం పొరుగు దేశాలలోని తమ  ఎంబసీలతో రాయబార కార్యాలయాలతో నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు.

ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దు చెక్‌పాయింట్‌లకు చేరుకునే భారతీయ పౌరులకు సహాయం చేయడం ఎంబసీకి కష్టతరంగా మారింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరాల్లో నీరు, ఆహారం, వసతి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఉండటం సురక్షితమైనది. పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు రాకండని హెచ్చరించారు.

ప్రస్తుతం తూర్పు సెక్టార్‌లో ఉన్న వారందరూ తదుపరి సూచనల వరకు తమ  ప్రస్తుత నివాస స్థలాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. వీలైనంత వరకూ ఇంట్లో లేదా షెల్టర్‌లలో ఉండాలని, ఆహారం, నీరు, సౌకర్యాలు అందుబాటులో ఉంచుకుని ఓపికగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకండి. ఎప్పటికప్పుడు తమ పరిసరాల్లో ఉన్న పరిణామాల గురించి తెలుసుకోవాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సూచించింది.