జీయర్ స్వామి ఆహ్వానాన్ని పట్టించుకొని కేసీఆర్

 ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, చినజీయర్ స్వామిల మధ్య తలెత్తిన  విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాంతికల్యాణాన్ని ఈ నెల 19న నిర్వహించాలని అనుకున్నారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని 19కి చినజీయర్‌ స్వామి వాయిదా వేశారు. 
 
అయితే శాంతి కల్యాణ కార్యక్రమాన్ని కేసీఆర్ కోసమే వాయిదా వేశారని ప్రచారం జరిగింది. అయినా ముచ్చింతల్ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. జీయర్ స్వామి ఆహ్వానాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. కనీసం హాజరు కాలేకపోతున్నట్లు సందేశం కూడా పంపలేదని తెలుస్తున్నది. కేసీఆర్ ముచ్చింతల్ కార్యక్రమ రద్దుతో మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు రెండు రోజుల ముందు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి, వేడుకల సమయంలో అటువైపే వెళ్లకపోవడంతో వారి మధ్య విబేధాల గురించి మీడియాలో పలు కధనాలు వెలువడ్డాయి. కనీసం ఆయన కుటుంభం సభ్యులు కూడా ఎవ్వరు పాల్గొనలేదు. ఒకరిద్దరు మంత్రులు, కొద్దిమంది ప్రజా ప్రతినిధులు మినహా అధికార పార్టీ నేతల చాలావరకు దూరంగా ఉన్నారు. 
 
 ముగింపు కార్యక్రమానికి సీఎం దూరంగా ఉన్నారు. కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి రప్పించేందుకు చినజీయర్‌ స్వామితోపాటు మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంతలోనే కేసీఆర్, చినజీయర్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారం ఊపందుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌తో విభేదాలపై   చినజీయర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్‌తో తనకు ఎటువంటి విభేదాలూ లేవని త్రిదండి చినజీయర్‌స్వామి స్పష్టం చేశారు. సహస్రాబ్ది ఉత్సవాలకు మొదటి సేవకుడిని తానేనని సీఎం ప్రకటించారని.. అలాంటి వ్యక్తితో తమకు ఎందుకు విభేదాలుంటాయని ప్రశ్నించారు. ఇది ఎవరో సృష్టించారని చినజీయర్ పేర్కొన్నారు.
 
శుక్రవారం కూడా మేడారం జాతరకు ముఖ్యమంత్రి వీడుతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించినా, ఆయన వెళ్ళలేదు. ఆదివారం ముంబై వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీకానున్న రుష్ట్యా, రెండు రోజులుగా అందుకు సన్నాహాలలో తీరికలేకుండా ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు గురించి వీరిద్దరూ చర్చించుకొని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.